అంకితభావం ఉంటేనే అభివృద్ధి సాధ్యం

ABN , First Publish Date - 2022-12-07T00:27:21+05:30 IST

అంకితభావం ఉంటేనే అభివృద్ధి చేయడం సాధ్యమవుతుందని, ఆ అంకితభావంతోనే ఖమ్మం నగరాన్ని ఎంతో అభివృద్ధి చేశారని, ఇక్కడి ప్రణాళికలను నిజామాబాద్‌లో అమలు చేయాలని తమ జిల్లా అధికారులను ఆదేశించామని నిజామాబాద్‌ కలెక్టర్‌ నారాయణరెడ్డి, అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్తా పేర్కొన్నారు. ఖమ్మంలో జరిగిన అభివృద్ధిని చూడా

అంకితభావం ఉంటేనే అభివృద్ధి సాధ్యం

ఖమ్మం ప్రణాళికలు నిజామాబాద్‌లో అమలు చేస్తాం

నిజామాబాద్‌ కలెక్టర్‌ నారాయణరెడ్డి, అర్బన ఎమ్మెల్యే గణేష్‌గుప్తా

నగరంలో పలు ప్రాంతాల పరిశీలన

ఖమ్మం కార్పొరేషన, డిసెంబరు 6: అంకితభావం ఉంటేనే అభివృద్ధి చేయడం సాధ్యమవుతుందని, ఆ అంకితభావంతోనే ఖమ్మం నగరాన్ని ఎంతో అభివృద్ధి చేశారని, ఇక్కడి ప్రణాళికలను నిజామాబాద్‌లో అమలు చేయాలని తమ జిల్లా అధికారులను ఆదేశించామని నిజామాబాద్‌ కలెక్టర్‌ నారాయణరెడ్డి, అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్తా పేర్కొన్నారు. ఖమ్మంలో జరిగిన అభివృద్ధిని చూడాలంటూ సీఎం కేసీఆర్‌ ఇటీవల ఇచ్చిన ఆదేశం మేరకు నిజామాబాద్‌ కలెక్టర్‌, అర్బన్‌ ఎమ్మెల్యే.. మేయర్‌ నీతుకిరణ్‌, అదనపు కలెక్టర్‌, కార్పొరేషన కమిషనర్‌ చిత్రామిశ్రా, ఇంజనీరింగ్‌, టౌనప్లానింగ్‌ అధికారులతో కలిసి మంగళవారం ఖమ్మంలో పర్యటించారు. నగరంలోని మినీలకారం పంచతత్వ పార్కు, గోళ్లపాడు ఛానెల్‌ ఆధునీకరణ పనులు, పలు పార్కులు, వాక్‌వేలు, వైకుంఠధామం, బస్తీదవాఖానాలు, నూతనబస్టాండ్‌, ఐటీహబ్‌తో పటుఉ నగరంలో నిర్మించిన వీడీఎఫ్‌ రహదారులను పరిశీలించారు. అనంతరం ఖమ్మం నగరపాలకసంస్థ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో నిజామాబాద్‌ కలెక్టర్‌ నారాయణరెడ్డి మాట్లాడుతూ తమ జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులు కూడా చివరి దశకు వచ్చాయని, అయితే ఖమ్మం అత్యంత వేగంగా అభివృద్ధి జరిగిందన్నారు. ఎమ్మెల్యే గణేష్‌గుప్తా మాట్లాడుతూ ఖమ్మం ఎమ్మెల్యే, రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ లాంటి నేత లభించటం ఖమ్మం ప్రజల అదృష్టమని పేర్కొన్నారు. పువ్వాడ ఖమ్మాన్ని ఎంతో అభివృద్ధి చేశారన్నారు. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ సహకారంతో నిధులు తెచ్చి స్వల్పకాలంలోనే ఖమ్మంనగర రూపురేఖలు మార్చారన్నారు. గోళ్లపాడు చానల్‌ ఆధునికీకరణ, సుందరీకరణ తనను ఎంతో ఆకట్టుకున్నాయన్నారు. అంతకు ముందు ఖమ్మం నగరపాలకసంస్థ కమిషనర్‌ ఆదర్శ్‌సురభి నగరంలో జరిగిన అభివృద్ధి పనులను పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. ఈ సమావేశంలో ఖమ్మం కలెక్టర్‌ వీపీ. గౌతమ్‌, సుడా చైర్మన్‌ బచ్చు విజయ్‌కుమార్‌, సహాయ కమిషనర్‌ బి.మల్లీశ్వరి, పబ్లిక్‌హెల్త్‌ ఈఈ రంజితకుమార్‌, ఇంజనీరింగ్‌శాఖ డీఈలు, ఏఈలు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-07T00:27:22+05:30 IST