‘పది’లో ఉత్తమ ఫలితాలు సాధించాలి: డీఈవో

ABN , First Publish Date - 2022-12-07T23:28:07+05:30 IST

పదవ తరగతి విధ్యార్ధులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని డీఈవో సోమశేఖర శర్మ అన్నారు.

‘పది’లో ఉత్తమ ఫలితాలు సాధించాలి: డీఈవో
విద్యార్థినులతో మాట్లాడుతున్న డీఈవో

అన్నపురెడ్డిపల్లి, డిసెంబరు 7: పదవ తరగతి విధ్యార్ధులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని డీఈవో సోమశేఖర శర్మ అన్నారు. మండలపరిదిలోని రాజాపురం, ఎర్రగుంట జడ్పీ పాఠశాలలను బుధవారం డీఈవో ఆకస్మికంగా తనిఖీ చేసారు. పదవతరగతి విధ్యార్ధులను పలు సామర్ధ్యాలపై ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు. విధ్యార్ధులకు పలు సూచనలు చేసారు. ప్రతిరోజు సాయంత్రం పదవతరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. అనంతరం ఎర్రగుంట ప్రాధమిక పాఠశాలను సందిర్శించి తొలిమెట్టు కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భగా డీఈవో మాట్లాడుతూ.. విద్యార్థులకు పదో తరగతి మైలురాయి లాంటిందని అన్నారు. ఇప్పుడు కష్టపడి చదివితే జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చునని అన్నారు. ఉపాధ్యాయులు బోధించే అంశా లను శ్రద్ధగా ఆలకించాలని సూచించారు. యన వెంట ఎంఈవో సత్యనారాయణ, హెచ్‌ఎం మోహనరావు ఉన్నారు.

Updated Date - 2022-12-07T23:28:53+05:30 IST