‘ధాన్యం’ చెల్లింపుల్లో జాప్యం!

ABN , First Publish Date - 2022-12-16T01:23:26+05:30 IST

ఉమ్మడిజిల్లాలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ఓ వైపు జరుగుతుండగా.. రైతులకు సొమ్ముల చెల్లింపుల్లో మాత్రం జాప్యం జరుగుతోంది. ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకు లక్షా49వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు జరగ్గా..వాటికి సంబంధించి ఇంకా రూ.19కోట్ల చెల్లింపుల్లో జాప్యం జరుగుతోంది.

‘ధాన్యం’ చెల్లింపుల్లో జాప్యం!
సేకరించిన ధాన్యం ఇలా

ఉమ్మడి జిల్లాలో రూ.19కోట్లకుపైగా బకాయిలు

కొనుగోళ్లలోనూ ‘ప్రైవేటు’ జోరు

ఖమ్మం కలెక్టరేట్‌ / కొత్తగూడెం కలెక్టరేట్‌, డిసెంబరు 15 : ఉమ్మడిజిల్లాలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ఓ వైపు జరుగుతుండగా.. రైతులకు సొమ్ముల చెల్లింపుల్లో మాత్రం జాప్యం జరుగుతోంది. ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకు లక్షా49వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు జరగ్గా..వాటికి సంబంధించి ఇంకా రూ.19కోట్ల చెల్లింపుల్లో జాప్యం జరుగుతోంది. నవంబర్‌ మూడో వారం నుంచి కొనుగోలు కేంద్రాలు అందుబాటులోకి రాగా ఖమ్మం జిల్లాలో ఇప్పటి వరకు 58800.280 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. అయితే ఈ సారి ప్రైవేటు వ్యాపారుల కొనుగోళ్లే జోరుగా సాగుతున్నట్లు తెలుస్తోంది. జిల్లా సరిహద్దు ప్రాంతాల నుంచి ఆంధ్రాకు కూడా అధిక మొత్తంలోనే మన ధాన్యం తరలిపోయినట్లు సమాచారం. దీంతో పౌరసరఫరాల సంస్థ ఈ ఏడాది కనీసం 2.80 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యం పెట్టుకుంది. జిల్లాలో వానాకాలంలో 223 కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం సేకరించాలని నిర్ణయించినా 169 కేంద్రాల్లోనే కొనుగోళ్లు ప్రారంభించారు. వీటిద్వారా ఇప్పటి వరకు దాదాపు 8731 మంది రైతుల నుంచి 60470.320 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. వీటికి గాను బుధవారం నాటికి 2,870 మంది రైతులకు రూ.36.31కోట్ల చెల్లింపులు జరగ్గా.. సేకరించిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లర్లకు రవాణా చేసి నూటికి నూరుశాతం మిల్లింగ్‌ చేసిన బియ్యాన్ని గోదాములకు తరలిస్తున్నారు. ఇంకా జిల్లాలో 5,861 మంది రైతులకు రూ.11.14కోట్ల ధాన్యం సొమ్ములు బకాయిలున్నాయి. వీటిని వారం లోగా రైతులకు నేరుగా వారి ఖాతాల్లో జమచేయనున్నట్లు అఽధికారులు చెబుతున్నా చెల్లింపుల్లో తీవ్ర జాప్యం అవుతుందని రైతులు వాపోతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇప్పటి వరకు 1,435మంది రైతుల వద్ద రూ.21కోట్లు విలువైన 10,200 మెట్రిక్‌టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయగా.. తొలుత జిల్లాలో 2.50లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యం పెట్టుకుని 152 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. సహకార సంఘాల ద్వారా 117 కొనుగోలు కేంద్రాలు, గిరిజన కో అపరేటివ్‌ కేంద్రాలు(జీసీసీ) ద్వారా 32, ఐకేపీల ద్వారా 3 కేంద్రాలను ఏర్పాటు చేశారు. వానాకాలం సీజనలో జిల్లాలో 1,64,239 ఎకరాల్లో రైతులు వరి సాగు చేయగా.. కొనుగోలు కేంద్రాలకు సుమారు 2.50లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేసిన అధికారులు అందుకు ఏర్పాట్లు చేశారు. కానీ వాతావరణం అనుకూలించకపోవడంతో 1.50లక్షల మెట్రిక్‌ టన్నులు కొనుగోలుకు నిర్ణయించారు. ప్రభుత్వం ఏ గ్రేడ్‌ ధాన్యానికి రూ.2,060, కామన రకానికి రూ.2,040గా మద్దతు ధర నిర్ణయించారు. ఇంకా 300మంది రైతులకు రూ.8కోట్లు చెల్లించాల్సి ఉంది. మరో నాలుగైదు రోజుల్లో వారికి కూడా నగదు చెల్లించనున్నట్లు అధికారులు చెబుతున్నారు.

Updated Date - 2022-12-16T01:23:27+05:30 IST