వరకట్న వేధింపులతో యువతి ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-03-19T05:14:22+05:30 IST

కట్టుకున్న భర్త, అత్తామామలు పెడుతున్న వరకట్న వేధింపులతో విసుగు చెందిన ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన భద్రాద్రికొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కేటీపీఎస్‌ ఏ కాలనీలో శుక్రవారం జరిగింది.

వరకట్న వేధింపులతో యువతి ఆత్మహత్య
కవిత( ఫైల్‌ఫోటో)

పెళ్లయిన ఏడాదిన్నరకే అనంతలోకాలకు 

భద్రాద్రి జిల్ల పాల్వంచలో ఘటన

పాల్వంచ, మార్చి 18: కట్టుకున్న భర్త, అత్తామామలు పెడుతున్న వరకట్న వేధింపులతో విసుగు చెందిన ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన భద్రాద్రికొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కేటీపీఎస్‌ ఏ కాలనీలో శుక్రవారం జరిగింది. కేటీపీఎస్‌ కాలనీకి చెందిన పండగ జనార్దన్‌ కుమార్తె కవిత(26)ను ఖమ్మం నగరానికి చెందిన తంగిరాల జీవన్‌దత్‌కు ఇచ్చి 2020లో వివాహం చేసారు. పెళ్లి సమయంలో రూ.6లక్షల కట్నంతో పాటు 10తులాల బంగారం ఇచ్చి వైభవంగా వివాహం జరిపించారు. ఏడాది పాటు అన్యోన్యంగానే గడిపిన ఆ జంట మధ్య అదనపు కట్నం చిచ్చు రేపింది. ఈ విషయంలో భార్యాభర్తల మధ్య తరచూ గడవలు జరుతుండగా.. కవిత అత్త,మామలు అదనపు కట్నం కోసం వేధించడం, దానికి భర్త జీవన్‌దత్‌ కూడా సహకరించటంతో మనస్తాపానికి గురైన కవిత ఇటీవల పాల్వంచలోని తల్లిదండ్రుల వద్దకు వచ్చింది. ఇప్పటికే మనోవేదనలో ఉన్న కవిత తన చావుకు అత్త, మామ, భర్తే కారణమని సూసైడ్‌ నోట్‌ రాసి.. శుక్రవారం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఏఎస్పీ రోహిత్‌రాజ్‌ నేతృత్వంలో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. 

Read more