ఏరియా వైద్యశాల సిబ్బందితో డీసీహెచ్‌ఎస్‌ సమీక్ష

ABN , First Publish Date - 2022-12-15T23:16:56+05:30 IST

భద్రాచలంలోని ప్రభుత్వ ఏరియా వైద్యశాల వైద్యులు, సిబ్బందితో డీసీహెచ్‌ఎస్‌ డా. రవిబాబు సమీక్షించారు.

ఏరియా వైద్యశాల సిబ్బందితో డీసీహెచ్‌ఎస్‌ సమీక్ష

భద్రాచలం, డిసెంబరు 15: భద్రాచలంలోని ప్రభుత్వ ఏరియా వైద్యశాల వైద్యులు, సిబ్బందితో డీసీహెచ్‌ఎస్‌ డా. రవిబాబు సమీక్షించారు. గురువారం భద్రాచలం వచ్చిన ఆయన నెల రోజుల క్రితం జిల్లా కలెక్టరు అనుదీప్‌ పర్యటన సమయంలో వచ్చిన లోటుపాట్ల పురోగతిని వైద్యాధికారులతో సమీక్షించారు. గతంలో కంటే ప్రసవాలు పెరిగాయని, అలాగే ఆరోగ్యశ్రీలో చేరికలు సైతం పెరిగాయని గుర్తించారు. ఇద్దరు ఆర్‌ఎంవోలను నియమించడం వల్ల పరిపాలనపరమైన వ్యవహారాల్లో జాప్యం లేకుండా జరుగుతున్నాయని గుర్తించారు. ప్రత్యేక నిపులైన వైద్యులకు వార్డుల తనిఖీ బాధ్యతలు అప్పగించగా దాని ద్వార నాణ్యమైన వైద్యం అందుతోందని డా. రవిబాబు ‘ఆంధ్రజ్యోతి’తో తెలిపారు. వైద్యశాలలోని పలు చోట్ల మరమ్మత్తులు చేయాలని గతంలో సూచించామని వాటిని వైద్యాధికారులు మరమ్మత్తులు చేయించారని తెలిపారు. వైద్యశాలకు కొన్ని వైద్య పరికరాలు కావాలని అధికారులు కోరారని వాటి విషయం జిల్లా కలెక్టరు అనుదీప్‌ దృష్టికి తేనున్నట్లు తెలిపారు. ఈ సమీక్షలో ఏరియా వైద్యశాల సూపరింటెండెంట్‌ డా. ఎం.రామకృష్ణ, ఆర్‌ఎంవోలు డా.రాజశేఖర్‌రెడ్డి, డా. దేవిక పాల్గొన్నారు.

Updated Date - 2022-12-15T23:17:00+05:30 IST