విద్యుక్త ధర్మం నిర్వర్తించరూ!

ABN , First Publish Date - 2022-10-09T04:32:49+05:30 IST

మండలంలో విద్యుత్‌ శాఖ పనితీరు అస్తవ్యస్థంగా మారింది.

విద్యుక్త ధర్మం నిర్వర్తించరూ!
కిందకు వేలాడుతున్న విద్యుత్‌ వైర్లు

ఏన్కూరులో అధ్వానంగా విద్యుత్‌ శాఖ పనితీరు

కొత్త లైన్ల నిర్మాణంలో నిర్లక్ష్యం

వేలాడే తీగలు సరిచేయడంలోనూ అదే తీరు

పట్టించుకోని ఉన్నతాధికారులు

ఇబ్బందులుపడుతున్న మండల ప్రజలు

ఏన్కూరు, అక్టోబరు 8: మండలంలో విద్యుత్‌ శాఖ పనితీరు అస్తవ్యస్థంగా మారింది. స్తంభాలు ఒరిగిపోవడం, తీగలు వేలాడడం, ప్రమాదకరంగా ట్రాన్స్‌ఫార్మర్లు తోపా టు, విద్యుత్‌ సరఫరాలో తరుచూ అంతరాయం కలగడం తో మండల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల కొన్ని రోజులు విద్యుత్‌ సరఫరాకు గంటల తరబడి ఆటంకం కలిగి ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారు. మండల పరిధిలోని జన్నారం, రాజులపాలెం, బద్రుతండా, నాచా రం, ఒంటిగుడిసె, బురదరాఘవాపురం, తిమ్మరావుపేట, మూలపోచారం, రంగాపురంలో స్తంభాలు ఒరిగి వైర్లు కిందకి వేలాడడంతో రైతులు పొలాల్లో పని చేసేందుకు భయపడుతున్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుం దోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజులపాలేనికి చెందిన రైతు ధరావత్‌ బాబూలాల్‌ తన పొలంలో ప్రమాదకరంగా ఉన్న తీగలను సరి చేయాలని ఆరేళ్ల నుంచి విద్యుత్‌శాఖ అధికారుల చుట్టూ తిరిగాడు. చివరికి ఆరు నెలల క్రితం స్తంభాలు వేశారు. కానీ ఇప్పటి వరకు అమర్చలేదని రైతు ఆందోళన చెందుతున్నాడు. ఏ చిన్న సమస్యనైనా విద్యుత్‌ అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని రైతులు వాపోతున్నారు. మండల కేంద్రం ఏన్కూరులో విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు ప్రమాద కరంగా తక్కువ ఎత్తులో కిందకు ఉన్న పట్టించుకోవడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. పొలాల్లోని విద్యుత్‌ ట్రాన్స్‌ ఫార్మర్లు తగిలి మూగజీవాలు బలవుతున్నా అధికారులు స్పందించడంలేదు. బిల్లులు నెలకు కాకుండా 40 నుంచి 50రోజుల తర్వాత తీయడంతో సరాసరి పెరిగి ఎక్కువగా వస్తున్నాయని, వినియోగదారులు వాపోతున్నారు. సక్ర మంగా నెల నెలా బిల్లులు తీసేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.


Read more