భద్రాద్రిలో భక్తుల సందడి

ABN , First Publish Date - 2022-11-20T23:55:28+05:30 IST

దక్షిణ అయోధ్య భద్రాద్రిలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. సెలవుదినం కావడంతో సీతారామచంద్రస్వామిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మూలవరులకు ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. ఆర్జితసేవలో భాగంగా భక్తుల సమక్షంలో సువర్ణ పుష్పార్చన నిర్వహించారు.

భద్రాద్రిలో భక్తుల సందడి
భద్రాద్రి దేవస్థానంలో స్వామి దర్శనం కోసం క్యూలో వేచిఉన్న భక్తులు

స్వామివారికి ప్రత్యేక అభిషేకం, స్వర్ణపుష్పార్చన

భద్రాచలం, నవంబరు 20: దక్షిణ అయోధ్య భద్రాద్రిలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. సెలవుదినం కావడంతో సీతారామచంద్రస్వామిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మూలవరులకు ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. ఆర్జితసేవలో భాగంగా భక్తుల సమక్షంలో సువర్ణ పుష్పార్చన నిర్వహించారు. అలాగే నిత్యకల్యాణ మండపంలో స్వామి వారికి నిత్యకల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. సికింద్రాబాద్‌లోని బోయినపల్లికి చెందిన తెలగ లింగంగౌడ్‌ దేవస్థానం నిత్యాన్నదాన పథకానికి రూ.1లక్ష విరాళంగా అందజేశారు.

స్వామిని దర్శించుకున్న టీఎనజీవో రాష్ట్ర అధ్యక్షుడు

భద్రాద్రి సీతారామచంద్రస్వామిని టీఎనజీవో రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేంద్ర కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దేవస్థానం అధికారులు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు వేద ఆశీర్వచనం ఇచ్చి, దేవస్థానం తరపున జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో టీఎనజీవో నాయకులు అమరనేని రామారావు, డెక్క నరసింహారావు, గగ్గూరి బాలకృష్ణ పాల్గొన్నారు.

Updated Date - 2022-11-20T23:55:28+05:30 IST

Read more