కేంద్రం పట్టించుకోకపోయినా కార్పొరేట్‌ స్థాయి విద్యాబోధన

ABN , First Publish Date - 2022-07-06T04:36:04+05:30 IST

కేంద్రం పట్టించుకోకపోయినా విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని కార్పొరేట్‌ స్థాయిలో అన్నిసౌక్యరాలు సమకూర్చి విద్యాభోదన చేస్తున్నామని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. మంగళవారం ఖమ్మం జిల్లా కారేపల్లి మండల కేంద్రంలో పర్యటించిన ఆయన కస్తూర్బాగాంధీ కళాశాలలో రూ.2కోట్ల వ్యయంతో నిర్మించిన అదన

కేంద్రం పట్టించుకోకపోయినా కార్పొరేట్‌ స్థాయి విద్యాబోధన
తరగది గదులను ప్రారంభిస్తున్న మంత్రి,ఎమ్మెల్యే

కేసీఆర్‌ ప్రభుత్వ బడుల ముఖచిత్రాన్ని మార్చేశారు

రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ 

కారేపల్లి, జూలై 5 :  కేంద్రం పట్టించుకోకపోయినా విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని కార్పొరేట్‌ స్థాయిలో అన్నిసౌక్యరాలు సమకూర్చి విద్యాభోదన చేస్తున్నామని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. మంగళవారం ఖమ్మం జిల్లా కారేపల్లి మండల కేంద్రంలో పర్యటించిన ఆయన కస్తూర్బాగాంధీ కళాశాలలో రూ.2కోట్ల వ్యయంతో నిర్మించిన అదనపు తరగతి గదులను వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్‌తో కలసి ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ  కేంద్ర ప్రభుత్వం రాష్ర్టానికి రావాల్సిన నిధుల్లో కోతపెట్టటమే కాకుండా విద్యాభారాన్ని మోపుతోందని, మోడల్‌ కళాశాలలు, ఏకలవ్య పాఠశాలల భారాన్ని రాష్ట్రమే భరిస్తోందని, సీఎం కేసీఆర్‌ తన పాలనలో ప్రభుత్వ బడుల ముఖచిత్రాన్ని మార్చారని, పిల్లల చదువు తల్లిదండ్రులకు భారం కావద్దనే ఉద్దేశ్యంతో అన్నివసతులతో 973 గురుకులాలను ఏర్పాటుచేశామన్నారు. అదేవిధంగా తల్లిదండ్రుల డిమాండ్‌కు అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు. మహిళలకు సమాన అవకాశాలతోనే సాధికారిత సాధ్యమని, కేంద్రం ఎన్ని పార్టీలు అధికారంలోకి వస్తున్నా 33శాతం రిజర్వేషన్‌ బిల్లు మాత్రం అమోదం కావాడం లేదన్నారు. ఎమ్మెల్యే రాములునాయక్‌ మాట్లాడుతూ వైరా నియోజకవర్గ అభివృద్ధికి అన్నివిధాలుగా సహకరిస్తున్న మంత్రి పూవ్వాడకు తాను విధేయుడిగా ఉంటానన్నారు. ఈ సందర్భంగా పలు సమస్యలను ఆయన మంత్రి దృష్టికి తీసుకెళ్లగా స్పందించిన మంత్రి అన్ని సౌకర్యాలు కల్పిస్తామని, వీటిపై సమగ్రనివేదికను ఎమ్మెల్యేకు అందించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో వైరా మాజీ ఎమ్మెల్యే బాణోత్‌ చంద్రావతి, డీఈవో యాదయ్య, అర్డీవో రవీంద్రనాథ్‌, డీఆర్‌డీవో విద్యాచందన, జడ్పీటీసీ జగన్‌, ఎంపీపీ శకుంతల, ఆత్మచైర్మన్‌ ముత్యాల సత్యానారాణ, ఎంపీడీవో చంద్రశేఖర్‌, తహసీల్దార్‌ రవికుమార్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్ష, కార్యదర్శులు రాంబాబు, అజ్మీర వీరన్న పలువురు సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-06T04:36:04+05:30 IST