విద్యార్థులతో ప్రమాదకరంగా వంట పనులు

ABN , First Publish Date - 2022-09-25T04:32:46+05:30 IST

వెనుకబడిన తరగతుల సంక్షేమవసతి గృహంలో చదువుకునేందుకు వెళ్లిన విద్యార్థులకు వెట్టి చాకిరీ తప్పటం లేదు. ప్రమాదకరంగా వంటశాలలో సైతం విద్యార్థులతో వంట పనులు

విద్యార్థులతో ప్రమాదకరంగా వంట పనులు
వేడి సాంబార్‌ పడడంతో గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గార్లపాటి జశ్వంత

సాంబారు తరలిస్తున్న ముగ్గురు విద్యార్థులపై జారిపడ్డ గిన్నె  

ఒక విద్యార్థికి 35శాతం కాలిన గాయాలు

సిబ్బందిపై మంత్రి గంగుల కమలాకర్‌ ఆగ్రహం

రఘనాథపాలెం, సెప్టెంబరు 24: వెనుకబడిన తరగతుల సంక్షేమవసతి గృహంలో చదువుకునేందుకు వెళ్లిన విద్యార్థులకు వెట్టి చాకిరీ తప్పటం లేదు. ప్రమాదకరంగా వంటశాలలో సైతం విద్యార్థులతో వంట పనులు చేయిస్తూ వేడిగా, బరువు కలిగిన వంట గిన్నెలను వంటశాల నుంచి వసతిగృహానికి తరలించే పనులను సైతం చిన్నారులచే చేయిస్తున్నారు. ఈ క్రమంలో వేడి  సాంబారు గిన్నెను తరలిస్తుండగా అది జారి ముగ్గురు విద్యార్థులపై పడగా ఒక విద్యార్థికి తీవ్ర గాయాలు కావటంతో జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఖమ్మంలోని ఏర్పాటు చేసిన వైరా బీసీ సంక్షేమవసతిగృహంలో ముగ్గురు విద్యార్థులతో శనివారం వంట పనులు చేయించారు. గార్లపాటి జస్వంత మరో ఇద్దరు విద్యార్థులు కలిసి వసతిగృహం బయట వంట చేసిన సాంబారు వసతిగృహంలోకి తరలించే క్రమంలో వేడి సాంబారు గిన్నే ముగ్గురు విద్యార్థులపై పడింది. దీంతో గార్లపాటి జశ్వంతకు శరీరంపై 35శాతం కాలిన గాయాలయ్యాయి. ఒక్క సారిగా విద్యార్థులు ఆర్తనాదాలు చేయటంతో వసతిగృహం ఉపాధ్యాయులు జస్వంతను జిల్లా ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

వసతిగృహం సిబ్బందిపై మంత్రి గంగుల పోనలో ఫైర్‌

బీసీ వసతిగృహంలో ముగ్గురు విద్యార్థులు ప్రమాదానికి గురైన విషయం తెలుసుకున్న బీఎస్‌పీ జిల్లా కార్యదర్శి మిరియాల నాగరాజు జిల్లా ఆసుపత్రికి వెళ్లి బాధితుడిని పరామర్శించారు. జరిగిన విషయాన్ని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్‌కు ఫోనలో తెలియజేశారు. విద్యార్థులతో వంట పనులు చేయించటంతోనే ప్రమాదం జరిగిందని మంత్రికి ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన మంత్రి పోనలో వసతిగృహం సిబ్బందిపై పైర్‌ అయ్యారు. హాస్టల్‌లో వంట సిబ్బంది ఉండగా విద్యార్థులతో ఎందుకు పనులు చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గాయాలైన విద్యార్థి ఆరోగ్య పరిస్థితిపై వాకాబు చేశారు. వార్డెనను వెంటనే హైదరాబాద్‌కు వచ్చి తనను కలవాలని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.

హెచఎం, వార్డెన సస్పెన్షన

వైరా శారదా ఇంజనీరింగ్‌ కళాశాలలో నిర్వహి స్తున్న మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో 8వ తరగతి విద్యార్థి జశ్వంత్‌ పై సాంబారు పడిన ఘటనపై జిల్లా కలెక్టర్‌ వెంటనే స్పందించారు. విద్యార్థుల భద్రతపై అలసత్వం వహించిన పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పి. మల్లయ్య, వార్డెన్‌ పాషాను కలెక్టర్‌ సస్పెండ్‌ చేశారు. విద్యార్థికి మెరుగైన చికిత్స అందజేయాలని జిల్లా వైద్యాధికారిని కలెక్టర్‌ ఆదేశించారు. కుకింగ్‌ కాంట్రాక్టు రద్దు చేస్తున్నట్లు తెలిపారు.గురుకుల పాఠశాలను వేరే ప్రదేశానికి మార్చనున్నట్లు కలెక్టర్‌ తెలిపారు.



Updated Date - 2022-09-25T04:32:46+05:30 IST