అవస్థలు పడి.. భయాన్ని గెలిచి..

ABN , First Publish Date - 2022-03-05T07:48:36+05:30 IST

అవస్థలు పడి.. భయాన్ని గెలిచి..

అవస్థలు పడి.. భయాన్ని గెలిచి..
ఉక్రెయిన నుంచి వచ్చిన తన కూతురుకి స్వీట్‌ తినిపిస్తున్న డాక్టర్‌ బాబూరావు

ఉక్రెయిన్‌ నుంచి స్వదేశానికి వస్తున్న విద్యార్థులు 

బుచ్‌ ఎయిర్‌పోర్టులో రెండు రోజులు నిలబడే ఉన్నాం

కొత్తగూడేనికి చెందిన మెడిసిన విద్యార్థి సాల్మన రాజు

ఇంటికి చేరుకున్న ఖమ్మం విద్యార్థిని పూజాతపస్వి

బంకర్లలో భయం భయంగా తలదాచుకున్నామని వెల్లడి

చుంచుపల్లి/ఖమ్మం కార్పొరేషన, మార్చి 4: ఉక్రెయిన, రష్యా యుద్ధం నేపథ్యంలో ఆ దేశంలో ఉన్నత చదువుల కోసం వెళ్లిన భారత విద్యార్థులు స్వస్థలాలకు చేరుకునేందుకు అవస్థలు పడు తున్నారు.భయం మధ్య గంటలకొద్దీ ప్రయాణాలు చేస్తూ సరైన ఆహారంలేకక్షేమంగా ఇళ్లకు చేరుకుంటే చాలు అన్నట్టుగా స్వదేశ బాటపడుతున్నారు. ఈ క్రమంలోనే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు కూడా ఎన్నో వ్యయప్రయాసలు పడుతూ ఒక్కరొక్కరుగా ఉక్రెయిన్‌ నుంచి తిరిగి వచ్చేస్తున్నారు. భద్రాద్రిజిల్లా కొత్తగూడెం పట్టణంలోని రామవరం ఎస్‌సీబీనగర్‌ కు చెందిన కోడూరి డేవిడ్‌ శ్రీనివాస్‌, విమల దంపతుల 22ఏళ్ల కుమారుడు స్మాలన రాజు ఉక్రెయిన్‌లోని ఇవానో రాష్ట్రంలో ఇవానో ఇంటర్నేషనల్‌ మెడిసిన్‌ కళాశాలలో మెడిసిన్‌ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. ఫిబ్రవరి 23వ తేదీన యుద్దం జరుగుతున్న క్రమంలో వీరు నివసించే వెస్ట్‌ ఉక్రెయిన ప్రాంతం లో ఎలాంటి ఇబ్బందులు లేకపోవడంతో అక్కడే సురక్షితంగా ఉన్నారు.కానీ అనుకోనిరీతిలో రష్యా మిసైల్‌ ప్రయోగాలు చేస్తు న్నట్టు ప్రకటించడంతో 26వ తేదీన 40మంది విద్యార్థులు సుమారు 8బస్సుల్లో ఆ దేశ సరిహద్దుల్లోకి వచ్చి.. అక్కడి నుంచి 12కిలోమీటర్లు కాలినడకన రుమేనియా దేశానికి చేరుకు న్నారు. అయితే రుమేరియాలోని బుచ ఎయిర్‌పోర్టులో కూర్చోవ డానికి కూడా స్థలం లేదని, రెండురోజులపాటు నిలబడే ఉన్నామని విద్యార్థి సాల్మనరాజు పేర్కొన్నాడు. ఈ రెండు రోజులు కేవలం రెండు శాండ్విచలను ఆహారంగా తీసుకున్నామని తెలిపారు. బాంబుల శబ్ధాలతో తీవ్రఆందోళనకు గురయ్యానని, తామే చని పోయామా అన్నట్టు అనిపించేదని వివరించాడు. బుచ్‌ ఎయిర్‌ పోర్టులో ఈ నెల 2న ఉదయం 6గంటలకు ముంబై విమానం ఎక్కామని, అక్కడ గురువారం మధ్యాహ్నం శంషాబాద్‌ వచ్చేం దుకు విమానం ఎక్కామని 2.30గంటలకు హైదరాబాద్‌ చేరుకు న్నామన్నారు. చివరకు తమ స్వస్థలమైన కొత్తగూడెం ప్రాంతా నికి చేరుకోవడం ఎంతో ఆనందంగా ఉందని తాను క్షేమంగా ఇల్లు చేరుకునేందుకు సహకరించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నానంటూ కన్నీటిపర్యం తరమయ్యాడు. కుమారుడి రాకతో తల్లిదండ్రులు సంతోషం వ్యక్తంచేశారు.తమ చుట్టుపక్కల వారికి డేవిడ్‌ శ్రీనివాస్‌, విమల దంపతులు, సాల్మన్‌రాజు సోదరుడు స్వీట్లు పంచారు. 

క్షేమంగా ఇంటికి చేరుకున్న పూజతపస్వి

ఖమ్మం నగరానికి చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్‌ బాబూ రావు కుమార్తె పూజ తపస్వి ఉక్రెయినలోని కర్య్కూస్‌ నేషన మెడికల్‌ యూనివర్సిటీలో ఎంబీబీఎస్‌ ఐదో సంవత్సరం చదువు తోంది. యుద్ధం నేపథ్యంలో అక్కడ చిక్కుకుని అనేక అవస్థలు పడిన ఆమె గురువారం ఖమ్మం నగరానికి చేరుకుంది. ఇంటికి చేరుకున్న ఆమెను తల్లిదండ్రులు గుండెలకు హత్తుకుని స్వాగ తం పలికారు. తమ కూతురు సురక్షితంగా ఇంటికి చేరుకోవడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు. అయితే యుద్ధ భయం నేపథ్యంలో తాము పడిన అవస్థలు, ఇంటికి చేరుకున్న తీరు గురించి పూజతపస్వివివరించారు. ‘వాస్తవానికి ఫిబ్రవరి 16నే యుద్ధంపై హెచ్చరికలు ఇచ్చారు. ఇక్కడి నుంచి వెళ్లాలని ఆదేశాలిచ్చారు. కానీ అదంతా మీడియా వార్‌ అనే వదంతులు రావడంతో అక్కడే ఉండిపోయాం. తీరా 26వ తేదీన తెల్లవారు జామునలేవడానికి ముందే బాంబులశబ్ధం వినిపిస్తోంది. ఒక్క సారిగా ఇంటర్‌నెట్‌ ఆగిపోయింది.బయటంతా చీకటి. ఏటూ పాలుపోవడంలేదు. హాస్టల్‌లోనే ఉండిపోయాం. తెల్లవారిన తర్వాత నేను మరో సిస్టర్‌ ధైర్యం చేసి పక్కనే ఉన్న మాల్‌కి వెళ్లాం. మూడుగంటలపాటు క్యూలో నిల్చున్నాం... తినడానికి అవసరమైనవి కొనుక్కున్నాం. అక్కడ తాగునీరు దొరకలేదు.. దాని కోసం మరో రెండు కిలోమీటర్ల దూరంలోని మరో మాల్‌కి వెళ్లాం. అక్కడ 20 లీటర్ల క్యానులో నీటిని తీసుకుని బంకర్‌లోకి వెళ్లిపోయాం. గతనెల 26వతేదీ నుంచి నుంచి 2తారీకు వరకు బంకర్‌లోనే ఉండిపోయాం. బంకర్‌ అంతా జనంతో నిండిపో యింది. కొందరు బంకర్‌లో ఉండలేక మెట్రోస్టేషన్లలో ఉండిపో యారు. మరికొంత మంది హాస్టల్స్‌లోనే ఉండిపోయారు. ఆ ఐదు రోజులు భయంకరమైన పరిస్థితులను అనుభవించాం. అక్కడి పరిస్థితులను చూసి భయం పెరిగింది. ఎలాగైనా మనదేశానికి వచ్చేయాలనుకున్నాం. అంతే 2వ తేదీన ఉక్రెయిన నుంచి రైల్లో  లివివ్‌ వరకు 20గంటలు ప్రయాణించాం. ఆ రైలు కూడా కిటకిటలాడుతోంది. అందుకే నిలుచునే ప్రయాణించాం.  ఇక లివివ్‌ నుంచి పోలెండ్‌ వెళ్లడానికి రైళ్లు లేవు. కానీ అక్కడికి చేరుకుంటేనే భారత ఎంబసీ అధికారులు విమానాలు ఏర్పాటు చేస్తామని చెప్పడంతో బస్సులో రెండున్నర గంటలు ప్రయా ణించి అక్కడికి చేరుకున్నాం. అక్కడి నుంచి ప్రత్యేక విమానం లో ఉక్రెయిన సరిహద్దులు దాటే సరికి మాకు ధైర్యం వచ్చిం ది. శుక్రవారం ఉదయం ఢిల్లీలో దిగి.. అక్కడి నుంచి హైద రాబాద్‌ వచ్చి ఇళ్లకు చేరుకున్నాం. వాస్తవానికి ఐదేళ్లుగా ఉక్రె యినలో ఉండి చదువుకుంటున్నాం. ఆ దేశంతో అను బంధం ఏర్పడింది. వెంటనే యుద్ధం ఆగిపోవాలని కోరు కుంటున్నాం. యుద్ధం కారణంగా సాధారణ పౌరుల జీవనం అస్తవ్యస్తమైంది. తిరిగి ఉక్రెయిన కోలుకోవా లంటే కనీసం 3 నుంచి 4 ఏళ్లు పడుతుందని అంటు న్నారు.మా ఎంబీబీఎస్‌ ఇంకో ఏడాదైతే పూర్తయ్యేది. మళ్లీ అక్కడికే వెళ్లి చదువుకుంటాం. మమ్మల్ని సురక్షితంగా ఇళ్లకు చేర్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన కృషి అభినందనీయం’ అని పేర్కొన్నారు. ఇక తన కూతురు దేశం కాని దేశంలో వారంరోజుల పాటు కష్టాలు అనుభవిస్తుంటే.. తాము ఆందోళన చెందామని, ఎట్టకేలకు సురక్షితంగా ఇంటికి చేరుకోవడం ఆనందంగా ఉందని పూజతపస్వి తండ్రి డాక్టర్‌ బాబూ రావు ‘ఆంధ్రజ్యోతి’కి వివరించారు. 

Read more