చర్లలో కలెక్టర్ పర్యటన
ABN , First Publish Date - 2022-12-15T23:15:17+05:30 IST
కలెక్టర్ అనుదీప్ గురువారం చర్ల మండలంలో పర్యటించారు. ముందుగా చర్ల మండలం వచ్చిన ఆయన చర్ల సీహెచ్‌సీని తనిఖీ చేశారు.
చర్ల, డిసెంబరు 15: కలెక్టర్ అనుదీప్ గురువారం చర్ల మండలంలో పర్యటించారు. ముందుగా చర్ల మండలం వచ్చిన ఆయన చర్ల సీహెచ్‌సీని తనిఖీ చేశారు. వైద్యం అందుతున్న తీరుని రోగులను అడిగి తెల్సుకున్నారు. అనం తరం రికార్డులను పరిశీలించారు. వైద్యశాలకు వచ్చే రోగులకు మెరుగైన వై ద్యం అందించాలని వైద్యుడు శ్రీధర్‌ని ఆదేశించారు. అనంతరం వైద్యశాల ఆవరణలో ఉన్న నూతన సీహెచ్‌సీ భవనాన్ని పరిశీలించారు. వెంటనే పనులు పూర్తి చెయ్యాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. వైద్యశాల నిర్మాణం పూర్తయిన వెంటనే అత్యాధునాతన పరికరాలతో పాటు, వైద్యులు నియమిస్తామని కలెక్టర్ తెలిపారు. అలాగే వైద్యశాల పరిసరాలు శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలసి ఎంపీడీవో రామకృష్ణను ఆదేశించారు. అనంతరం కొయ్యూరు పీహెచ్‌సీని తనిఖీ చేశారు. రోగులతో మాట్లాడారు. ఓపీ సేవల గురించి అడిగితెల్సుకున్నారు. అనంతరం బాలింతలకు కేసీఆర్ కిట్లు అందజేశారు. కలెక్టర్ వెంట డీఎంఅండ్‌హెచ్‌వో శిరీష, రాజ్ కుమార్, చర్ల తహసీల్థార్ భరణిబాబు, తదితరులు ఉన్నారు.