జ్ఞానంతోనే మార్పు సాధ్యం

ABN , First Publish Date - 2022-12-07T23:48:54+05:30 IST

జ్ఞానంతోనే మార్పు సాధ్యమని ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్‌ ఖాసీం పేర్కొన్నారు.

జ్ఞానంతోనే మార్పు సాధ్యం

ముదిగొండ, డిసెంబరు 7: జ్ఞానంతోనే మార్పు సాధ్యమని ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్‌ ఖాసీం పేర్కొన్నారు. బుధవారం ముదిగొండలో డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో కులభోజనాలు వద్దు...జనభోజనాలు చేద్ధామంటూ ఏర్పాటుచేసిన మన ఊరి జన వనభోజనాల కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. మనుషు లంతా సమానంగా ఉండాలని, ప్రతి మనిషి ఎదుటివారికి ఉపయోగపడే భావన కలిగి ఉండాలన్నారు. మనుషుల్లో సమానత లేకుండా తయారుచేసిన వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడి అసమానతలను తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. చరిత్రలో మనకంటూ ఒక గుర్తింపు ఉండాలని అప్పుడే ఆజీవితానికి ఒక సార్థకత ఉంటుందని పేర్కొన్నారు. అనంతరం కులం, మతోన్మాదం నశించాలని డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్‌ ఖాసీంను సన్మానించారు. ఆతర్వాత కులమతాలకతీతంగా అందరూ వనభోజనాలు చేశారు. కార్యక్రమంలో డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి బషీరుద్దీన్‌, రాజు, మెట్టెల సతీష్‌, నాగార్జున, నాగేశ్వరరావు, దస్తగిరి, సురేష్‌, నరేష్‌, వీరబాబు, రవి పాల్గొన్నారు.

Updated Date - 2022-12-07T23:48:55+05:30 IST