లోన్‌యా్‌పపై కేసు నమోదు

ABN , First Publish Date - 2022-05-24T06:44:19+05:30 IST

లోన్‌యా్‌పపై కేసు నమోదు

లోన్‌యా్‌పపై కేసు నమోదు

చర్చనీయాంశమైన ‘ఆంధ్రజ్యోతి’ కథనం

మధిరటౌన్‌, మే 23: ‘తీసుకున్న అప్పు చెల్లించకపోతే మీ అమ్మ ఫొటోను మార్ఫింగ్‌ చేసి పోర్న్‌సైట్‌ లో పెడతాం’ అంటూ మధిర పట్టణానికి చెందిన ఓ యువకుడిని వేధిస్తున్న దత్త రూపీ అనే లోన్‌యాప్‌ నిర్వాహకులపై కేసు నమోదు చేశామని ఖమ్మం జిల్లా మధిర టౌన్‌ ఎస్‌ఐ, శిక్షణ ఐపీఎస్‌ సంకీర్త్‌ తెలిపారు. సోమవారం మధిర టౌన్‌ పోలీ్‌సస్టేషన్‌లో విలేఖరులతో మాట్లాడుతూ మధిర ఎస్సీ కాలనీకి చెందిన వింజమూరి ప్రదీప్‌ దత్తరూపీ లోన్‌ యాప్‌ ద్వారా ఈనెల 5న రూ.5వేల రుణం తీసుకుని తిరిగి ఈనెల 17న చెల్లించాడని, లోన్‌ ఇచ్చే సమయంలో తన గుర్తింపు కార్డుతో పాటు, ష్యూరిటీగా తన తల్లి పాన్‌కార్డు కాపీని ఇచ్చాడని తెలిపారు. తీసుకున్న అప్పు చెల్లించినా ఇంకా చెల్లించాలంటూ మెసేజ్‌లు పెడుతుండటంతో పాటు.. వేర్వేరు నెంబర్ల నుంచి ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని, అప్పు చెల్లించకపోతే తన తల్లి ఫొటోను మార్ఫింగ్‌ చేసి పోర్న్‌సైట్‌లో పెడతామని బ్లాక్‌మొయిల్‌ చేస్తున్నారంటూ ప్రదీప్‌ తమకు ఫిర్యాదు చేశాడనాన్నరు. అతడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, ప్రజలు ఎవరూ ఇలాంటి యాప్‌ల ద్వారా లోన్‌ తీసుకొని మోసపోవద్దు అని విజ్ఞప్తి చేశారు. అయితే ఈ లోన్‌యాప్‌ ఉదంతం గురించి ‘ఆంధ్రజ్యోతి’లో ‘ఆన్‌లైన్‌ అప్పులోళ్లు’ శీర్షికన సోమవారం ప్రచురితమైన కథనం జిల్లాలో తీవ్ర చర్చనీయాంశమైంది. 

Read more