మూడింటికి ఒక్కటే భవనం

ABN , First Publish Date - 2022-02-20T04:44:40+05:30 IST

అదో మారుమూల గిరిజన గ్రామం ఆ రగ్రామంలో విద్యార్ధులు చదువుకోవాలన్నా, అంగన్‌వాడీ కేంద్రానికి పిల్లలు, బాలింతలు రావాలన్నా, అటవీశాఖ అధికారులు విధులు నిర్వహించాలన్నా అందరు ఒకే భవనం ఉపయోగించుకోవాలి..

మూడింటికి ఒక్కటే భవనం
అటవీశాఖ భవనంలో చదువుకుంటున్న విద్యార్థులు

ఒకటే భవనంలో పాఠశాల, అటవీశాఖ కార్యాలయం, అంగన్‌వాడీ కేంద్రం

ఇబ్బందిపడుతున్న విద్యార్థులు, గర్భిణులు, బాలింతలు

పాఠశాలకు  నూతన భవనం ఉన్నా .. ప్రారంభించడంలో విద్యాశాఖ నిర్లక్ష్యం

ఆళ్లపల్లి, ఫిబ్రవరి 19: అదో మారుమూల గిరిజన గ్రామం ఆ రగ్రామంలో విద్యార్ధులు చదువుకోవాలన్నా, అంగన్‌వాడీ కేంద్రానికి పిల్లలు, బాలింతలు రావాలన్నా, అటవీశాఖ అధికారులు విధులు నిర్వహించాలన్నా అందరు ఒకే భవనం ఉపయోగించుకోవాలి.. ఆళ్లపల్లి మండలంలోని సింగారంలో ఎంపీపీఎస్‌ పాఠశాలను ఏర్పాటు చేశారు. కానీ విద్యార్థులు కూర్చునే భవనం ప్రారంభానికి నోచుకోకపోవడంతో వారు నానా ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాల ఏర్పాటు నుంచి విద్యార్థులు వానాకాలం పూరిగుడిసెళ్లో, ఎండాకాలం చెట్ల కింద, ఉంటూ చదువుకునేవారు. ఈ క్రమంలోనే సుమారుగా 15ఏళ్ల కిందట అటవీశాఖ అధికారులు గ్రామంలో ఉండేం దుకు చిన్న భవనం ఏర్పాటు చేసుకున్నారు. విద్యార్థుల దుస్థితిని చూసిన అటవీశాఖ వారు ఉంటున్న భవనంలో చదువుకునేందుకు ఆశ్రయం కల్పించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు పాఠశాలలో చదువుతున్న విద్యార్థులతో పాటు, అంగన్‌వాడీ భవనం కూడా లేకపోవడంతో పిల్లలు, బాలింతలకు సైతం ఆ అటవీ శాఖ భవనమే దిక్కయింది. సూమారు పదేళ్ల క్రితం గ్రామంలో పాఠశాల భవన నిర్మాణానికి నిధులు వచ్చాయి. అప్పటి అధికారుల నిర్లక్ష్యం కారణంగా, కాంట్రాక్టర్‌ ఇష్టారాజ్యం వల్ల భవనం అనతికా లంలోనే శిథిలావస్థకు చేరింది. దీంతో ఎంపీపీ మంజు భార్గవి ఇటీవలే ఎమ్మెల్యే రేగా కాంతారావు దృష్టికి తీసుకేళ్లగా ఆయన నిధులు మంజూరు చేయడంతో భవనానికి మరమ్మతులు చేశారు. విద్యార్థులు చదుకు నేందుకు భవనం ఉన్నప్పటికీ సరైన ముహూర్తం లేకో, అధికారుల జాప్యమో.. ప్రారంభోత్సవంలో అడుగు ముందకు పడటం లేదు.

Read more