ఢిల్లీకి బీఆర్‌ఎస్‌ నేతలు

ABN , First Publish Date - 2022-12-13T23:58:08+05:30 IST

దేశరాజధాని ఢిల్లీలో బుధవారం జరగనున్న భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) కార్యాలయ ప్రారంభ వేడుకలో పాల్గొనేందుకు ఉమ్మడి జిల్లాకు చెందిన బీఆర్‌ఎస్‌ నేతలు, ప్రజాప్రతినిధులు ఢిల్లీకి తరలివెళ్లారు. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తోపాటు

ఢిల్లీకి బీఆర్‌ఎస్‌ నేతలు

నేడు ఎంపీ నామ నివాసంలో విందు

ఖమ్మం, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతిప్రతినిధి) : దేశరాజధాని ఢిల్లీలో బుధవారం జరగనున్న భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) కార్యాలయ ప్రారంభ వేడుకలో పాల్గొనేందుకు ఉమ్మడి జిల్లాకు చెందిన బీఆర్‌ఎస్‌ నేతలు, ప్రజాప్రతినిధులు ఢిల్లీకి తరలివెళ్లారు. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తోపాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనేతలు పయనమయ్యారు. ఈ క్రమంలో వారికి బీఆర్‌ఎస్‌ లోక్‌సభా పక్షనేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు ఢిల్లీలోని తన నివాసంలో బుధవారం రాత్రి విందు ఏర్పాటుచేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రైతుసమన్వయసమితి జిల్లా అధ్యక్షులతోపాటు ఇతర ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలందరికీ ఆయన ఆహ్వానం పంపారు. ఈ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు గాను పలువురు నామ వర్గీయులు కూడా ఢిల్లీ వెళ్లారు.

Updated Date - 2022-12-13T23:58:13+05:30 IST

Read more