ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి

ABN , First Publish Date - 2022-03-06T03:50:06+05:30 IST

జిల్లాలో యాసంగి ఒడ్లు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ (చిన్ని) ప్రభు త్వాన్ని డిమాండ్‌ చేశారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి
వినతిపత్రం సమర్పిస్తున్న కోనేరు చిన్ని

బీజేపీ జిల్లా అధ్యక్షుడు కోనేరు చిన్ని

కొత్తగూడెం కలెక్టరేట్‌, మార్చి 5: జిల్లాలో యాసంగి ఒడ్లు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ (చిన్ని) ప్రభు త్వాన్ని డిమాండ్‌ చేశారు. శనివారం కిసాన్‌ మోర్చా అధ్యక్షులు కోనేరు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై డీఆర్‌వో అశోక్‌ చక్రవర్తికి వినతిపత్రం సమర్పిం చారు. ఈ సందర్భంగా కోనేరు చిన్ని మాట్లాడుతూ కేంద్ర ప్ర భుత్వం యాసంగి దాన్యం కొనేందుకు సిద్దంగా ఉందని, రాష్ట్ర ప్రభుత్వం యాసంగి ఒడ్లు కొనుగోలుకు కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపి మాజీ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, కిసాన్‌ మోర్చా రాష్ట్ర కార్యదర్శి రమేష్‌, అధికార ప్రతినిధి వెంకటరెడ్డి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌ శ్రీనివాసరెడ్డి, చంద్రశేఖర్‌ పాల్గొన్నారు. 


Read more