మంత్రి పువ్వాడ వ్యాఖ్యలపై బీజేపీ నాయకుల నిరసన

ABN , First Publish Date - 2022-01-28T05:51:25+05:30 IST

జాతీయ బీసీ కమిషన్‌ సభ్యుడు తల్లోజు ఆచారిపై రవాణశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అనుచిత వ్యాఖ్యలు చేశారని, దీనికి నిరసనగా గురువారం భారతీయ జనతాపార్టీ ఆధ్వర్యంలో నగరంలో ర్యాలీ నిర్వహించారు.

మంత్రి పువ్వాడ వ్యాఖ్యలపై బీజేపీ నాయకుల నిరసన

ఖమ్మంబైపాస్‌రోడ్‌, జనవరి27: జాతీయ బీసీ కమిషన్‌ సభ్యుడు తల్లోజు ఆచారిపై రవాణశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అనుచిత వ్యాఖ్యలు చేశారని, దీనికి నిరసనగా గురువారం భారతీయ జనతాపార్టీ ఆధ్వర్యంలో నగరంలో ర్యాలీ నిర్వహించారు. దిష్టిబొమ్మ దహనం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈసందర్భంగా బీజేపీ జిల్లా అద్యక్షుడు గల్లాసత్యనారాయణ మాట్లాడుతూ  రవాణశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ఇటీవల వెలుగుమట్ల వద్ద జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ మీకు ఇంటి స్థలాలు ఎవరో చెబితే ఇవ్వలేదని, ఎవరి జేబులో డబ్బులు కాదని అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ఆచారిపై ఇటువంటి వ్యాఖ్యలు మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ చేయడం సరికాదని అన్నారు. ఆచారికి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని కోరారు. లేకపోతే బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని అన్నారు. మంత్రి హరీష్‌రావు పర్యటన అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తక్కళ్లపల్లి నరేందర్‌రావు, పార్టీ జిల్లా ఉపాధ్యక్షురాలు మంద సరస్వతి, జిల్లా ఉపాధ్యక్షులు బోయినపల్లి చంద్రశేఖర్‌, మహిళ మోర్చా జిల్లా అధ్యక్షురాలు దొడ్డ అరుణ, రవిరాథోడ్‌, కోటమర్తి సుదర్శన్‌, ఉపేందర్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.


Read more