TS News: ఇక్కడ ప్రతిపక్ష పార్టీలు పర్యటించకూడదా?: భట్టి

ABN , First Publish Date - 2022-08-17T16:26:12+05:30 IST

టీఆర్ఎస్ ప్రభుత్వం (TRS Govt.)పై సీఎల్పీనేత భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

TS News: ఇక్కడ ప్రతిపక్ష పార్టీలు పర్యటించకూడదా?: భట్టి

భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem): టీఆర్ఎస్ ప్రభుత్వం (TRS Govt.)పై సీఎల్పీనేత భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు (Kaleswaram Project) వెళ్లకుండా ప్రభుత్వం ఎందుకు అడ్డుకుంటుందని ప్రశ్నించారు. ఇది ప్రజాస్వామ్య దేశమని, ఇక్కడ ప్రతిపక్ష పార్టీలు పర్యటించకూడదా? అంటూ నిలదీశారు. మునిగిన మోటార్ల పరిశీలనతో పాటు ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తామన్నారు. భాదితులకు కాంగ్రెస్ (Congress) అండగా ఉంటోందన్నారు. టెర్రరిస్టుల మాదిరి మమ్మల్ని పోలీస్ బలగాలతో అడ్డుకోవడంపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని భట్టి విక్రమాక్క డిమాండ్ చేశారు.

Read more