రేపటినుంచి భట్టి పాదయాత్ర పునఃప్రారంభం

ABN , First Publish Date - 2022-06-08T05:21:58+05:30 IST

రేపటినుంచి భట్టి పాదయాత్ర పునఃప్రారంభం

రేపటినుంచి భట్టి పాదయాత్ర పునఃప్రారంభం
మాట్లాడుతున్న మల్లు నందిని

ఖమ్మంసంక్షేమవిభాగం/ మధిర టౌన్‌, జూన 7: ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు గాను సీఎల్పీ నేత, ఖమ్మం జిల్లా మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్‌ మార్చ్‌ పాదయాత్ర పునఃప్రారంభం కానుంది. గతంలో మధిర నియోజకవర్గంలోని ముదిగొండ మండలంలో ప్రారంభమైన పాదయాత్ర ఎర్రుపాలెం మండలం మీనవోలు వరకు జరిగింది. అప్పటి వరకు  340 కిలోమీటర్లు పూర్తవగా.. రాహుల్‌గాంధీ వరంగల్‌ సభ సమయంలో ఆగిపోగా.. మళ్లీ గురువారం మీనవోలు నుంచి పునఃప్రారంభించనున్నారు. ఈ మేరకు కాంగ్రెస్‌ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. జిల్లా కాంగ్రెస్‌ నాయకులు, ప్రజాప్రతినిదులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. 


ప్రజాసమస్యల పరిష్కారం కోసమే భట్టి పాదయాత్ర : మల్లు నందిని

ప్రజాసమస్యల పరిష్కారం కోసమే సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పీపుల్స్‌ మార్చ్‌ పేరుతో పాదయాత్ర నిర్వహిస్తున్నారని భట్టి సతీమణి, అమ్మ ఫౌండేషన్‌ చైర్మన్‌ మల్లు నందిని పేర్కొన్నారు. మంగళవారం మధిరలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ గురువారం మీనవోలు నుంచి భట్టి తన పాదయాత్రను పునఃప్రారంభించి.. మధిర మండలంలో ముగిసిన తరువాత వైరా మండలంలోకి ప్రవేశిస్తారన్నారు. ప్రజాసమస్యల పరిష్కారమే ధ్యేయంగా సాగుతున్న భట్టి పాదయాత్రను ప్రజలు జయప్రదం చేయాలని కోరారు.  ఈ సమావేశంలో మధిర మండల, పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షులు సూరంశెట్టి కిషోర్‌, రమణగుప్త, కౌన్సిలర్‌ కోనా ధనికుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-08T05:21:58+05:30 IST