సొంత నియోజకవర్గంలో భట్టి పాదయాత్ర హాస్యాస్పదం

ABN , First Publish Date - 2022-03-06T04:44:10+05:30 IST

మధిర నియోజకవర్గంలో ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర హాస్యాస్పదంగా ఉందని జడ్పీచైర్మన్‌ లింగాల కమల్‌రాజ్‌ ఎద్దేవా చేశారు.

సొంత నియోజకవర్గంలో భట్టి పాదయాత్ర హాస్యాస్పదం

ముదిగొండ, మార్చి5: మధిర నియోజకవర్గంలో ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర హాస్యాస్పదంగా ఉందని జడ్పీచైర్మన్‌ లింగాల కమల్‌రాజ్‌ ఎద్దేవా చేశారు. మధిర ప్రజలు తెలిసీ తెలియక మూడుసార్లు నిన్ను గెలిపిస్తే మధిర అభివృద్ధికి నువ్వు చేసిందేమిటని ప్రశ్నించారు. శనివారం ముదిగొండ మండలం వెంకటాపురంలో సర్పంచ్‌ కోటి అనంత రాములు నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో  మాట్లాడారు. పాదయాత్రలో నీ నటనకు... నటసార్వ భౌమబిరుదు ఇవ్వాలన్నారు. ఎమ్మెల్సీగా, డిప్యూటీ స్పీకర్‌గా, ప్రభుత్వ చిఫ్‌ విప్‌గా ఉండి మధిర నియోజకవర్గ ప్రజలకు నువ్వు చేసిన అభివృద్ధి ఏంటని ప్రశ్నించారు. పాదయాత్రకు ప్రజాస్పందన కరువై పక్క మండలాల నుంచి కూలీ లను అరువు తెచ్చుకొనే పరిస్థితి ఏర్పడిందన్నారు. పలు పార్టీల నుంచి టీఆర్‌ ఎస్‌లో చేరిన వారికి కండువాలు వేసి ఆహ్వానించారు. కార్యక్రమంలో ఎంపీపీ సామినేని హరి ప్రసాద్‌, మండల అధ్యక్షుడు వాచేపల్లి లక్ష్మారెడ్డి, సర్పంచ్‌లు కోటి అనంత రాములు, జక్కర్‌,  పసుపులేటి వెంకట్‌, బంకా మల్లయ్య,అనంతరెడ్డి, రమేష్‌, గడ్డం వెంకట్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-03-06T04:44:10+05:30 IST