Bhadradri: భద్రాద్రి శ్రీసీతారాముల పట్టాభిషేకం నేడు

ABN , First Publish Date - 2022-10-05T13:41:40+05:30 IST

భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో బుధవారం దసరా ఉత్సవాలు అంగరంగవైభవంగా జరుగుతున్నాయి.

Bhadradri: భద్రాద్రి శ్రీసీతారాముల పట్టాభిషేకం నేడు

భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem): దక్షిణ అయోధ్య భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో బుధవారం దసరా ఉత్సవాలు అంగరంగవైభవంగా జరుగుతున్నాయి. శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా విజయదశమి సందర్భంగా బుధవారం ఉదయం రామాలయంలో  సీతారామచంద్రస్వామికి శ్రీరామమహాపట్టాభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం ఈ సాయంత్రం కూనవరం రోడ్డులోని దసరా మండపంలో  విజయోత్సవం, శమీపూజ, ఆయుధ పూజ, శ్రీరామలీలా మహోత్సవం (రావణ వధ) దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. 


Read more