భద్రాచలం మూడు.. సారపాక రెండు

ABN , First Publish Date - 2022-12-17T01:18:02+05:30 IST

భద్రాచలం, సారపాక మేజ రు గ్రామపంచాయతీలను పునర్విభజన చేస్తూ జీవోనెం 45ను రాష్ట్రప్రభుత్వం శుక్రవారం జారీ చేసింది. భద్రాచలం మేజరు పంచాయతీని మూడు పంచాయతీలుగా, సారపా క మేజరు పంచాయతీని రెండు పంచాయతీలుగా విభజి స్తూ సర్వే నెంబర్ల ఆధారంగా సరిహద్దులను నిర్దేశించారు.

భద్రాచలం మూడు.. సారపాక రెండు

గ్రామ పంచాయతీల విభజన

జీవో 45ను జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

న్యాయపరమైన సమస్యలకు అవకాశం?

భద్రాచలం, డిసెంబరు 16: భద్రాచలం, సారపాక మేజ రు గ్రామపంచాయతీలను పునర్విభజన చేస్తూ జీవోనెం 45ను రాష్ట్రప్రభుత్వం శుక్రవారం జారీ చేసింది. భద్రాచలం మేజరు పంచాయతీని మూడు పంచాయతీలుగా, సారపా క మేజరు పంచాయతీని రెండు పంచాయతీలుగా విభజి స్తూ సర్వే నెంబర్ల ఆధారంగా సరిహద్దులను నిర్దేశించారు. అలాగే ఒక్కొక్క పంచాయతీకి జనాభ ప్రాతిపదికన వార్డు సభ్యుల సంఖ్యను నిర్దారిస్తూ జీవోలో పొందుపరిచారు.

మూడు పంచాయతీలుగా భద్రాచలం ఆవిర్భావం

ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలాన్ని మునిసిపాలిటీగా చేసేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో మూడు గ్రామ పంచాయతీలుగా విభజించారు. దీంతో భద్రాచలంతోపాటు సీతారామనగర్‌, శాంతినగర్‌ పంచాయతీలు కొత్తగా ఏర్పడ్డాయి. భద్రాచలం పంచాయతీ 700.4ఎకరాల విస్తీర్ణం ఉంటుంది. సర్వే నెంబర్లను 1 నుంచి 51, 121 నుంచి 126తో పాటు 127, 128, 132 సర్వే నెంబర్లలోని కొంత ప్రాంతాన్ని భద్రాచలం పంచాయతీలో కలిపారు. అలాగే సీతారామనగర్‌ పంచాయతీ 349.77 ఎకరాల్లో విస్తరించగా సర్వే నెంబరు 52 నుంచి 90 వరకు పరిధిలో ఉండనుంది. అలాగే శాంతినగర్‌ గ్రామ పంచాయతీ 997ఎకరాల్లో విస్తరించి ఉంటుంది. సర్వే నెంబర్లు 91 నుంచి 120 పూర్తిగా 121, 127, 128, 131, 132, 133 నుంచి 207 వరకు పాక్షిక భాగం కలవనుంది. అలాగే భద్రాచలం పంచాయతీకి 21మంది, సీతారామనగర్‌, శాంతినగర్‌ గ్రామ పంచాయతీకి 17మంది వార్డు సభ్యులను నిర్ధారించారు.

సారపాక విభజన ఇలా

సారపాక మేజరు గ్రామ పంచాయతీని రెండు పంచాయతీలుగా విభజించారు. 1,732 ఎకరాల్లో సారపాక పంచాయతీ ఆవిర్భవించింది. ఇందులో సర్వే నెం.1 నుంచి 5, 7 నుంచి 13, 146 నుంచి 223, 226 నుంచి 248 వరకు 262 సర్వే నెంబరులో పాక్షికంగా కలవనుంది. 17మంది సభ్యులు ఉండనున్నారు. అలాగే ఐటీసీ గ్రామ పచాయతీ 2,512.18 ఎకరాల్లో ఏర్పడనుంది. సర్వే నెంబర్లు 6, 14 నుంచి 35, 39 నుంచి 42, 87 నుంచి 99, 102 నుంచి 1456, 224, 225, 249 నుంచి 260, 263 వరకు, 262 పాక్షికంగా కలవనుంది. అలాగే సారపాక గ్రామ పంచాయతీకి 17 మంది వార్డు సభ్యులు, ఐటీసీకి 15మంది వార్డు సభ్యులు ఉండనున్నారు.

మండల పరిషతను పునరుద్ధరిస్తారా?

భద్రాచలం మేజర్‌ గ్రామ పంచాయతీని మూడు పంచాయతీలుగా పునర్విభజన చేయడంతో గతంలో రద్దయిన భద్రాచలం మండలపరిషతను కూడా పునరుద్ధరించే అవకాశాలు ఉన్నాయని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. గతంలో ఉమ్మడి భద్రాచలం మండలంలో 22 పంచాయతీలు ఉండేవి, పోలవరం ముంపు మండలాలు ఏపీ పరిధిలోకి వెళ్లడంతో భద్రాచలం మండల పరిధిలోని 21 పంచాయతీలు ఏపీ పరిధిలోకి వెళ్లాయి. దీంతో భద్రాచలం ఒకే పంచాయతీ ఉండటంతో సాంకేతికపరమైన సమస్యల కారణంగా 2020 జూలైలో మండలపరిషతను రద్దు చేశారు. భద్రాచలం మేజరు గ్రామ పంచాయతీ 1969లో ఆవిర్భవించగా 2002లో అప్పటి తెలుగుదేశం హయాంలో టౌనషి్‌పగా మార్చారు. అనంతరం 2006లో మునిసిపాలిటీగా అప్‌గ్రేడ్‌ చేయగా న్యాయపరమైన సమస్యలు ఏర్పడటంతో మళ్లీ 2011లో మేజరు గ్రామపంచాయతీగా మార్చారు. కాగా 2013 జూలై 31న భద్రాచలం పంచాయతీకి ఎన్నికలు నిర్వహించగా పాలక మండలి కొలువుదీరింది. ఈ నేపథ్యంలో పట్టణ పరిధి విస్తృతంగా ఉండటం, మునిసిపాలిటీగా చేసేందుకు చట్టపరంగా సమస్యలు ఏర్పడుతుండటంతో భద్రాచలంను మూడు పంచాయతీలుగా మారుస్తూ నిర్ణయం తీసుకొంది. అయితే రాజ్యాంగంలోని 5వ షెడ్యుల్‌ పరిధిలో ఉన్న భద్రాచలం, సారపాకలను గ్రామ పంచాయతీలను భద్రాచలం మూడు, సారపాక రెండుగా విభజించడంలో సాంకేతికపరమైన సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. వాస్తవానికి ఏజెన్సీ ఏరియాలో గ్రామసభ తీర్మానం అనంతరం దాని ఆమోదానికి అనుగుణంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని న్యాయనిపుణులు పేర్కొంటున్నారు. అయితే ప్రభుత్వం ఇటువంటి కనీస ప్రాథమిక సూత్రాలను పాటించకపోవడంతో న్యాయపరంగా సమస్యలు ఎదురయ్యే అవకాశాలు లేకపోలేదని వారు అభిప్రాయపడుతున్నారు.

Updated Date - 2022-12-17T01:18:03+05:30 IST