ముక్కోటి ఏర్పాట్లను పరిశీలించిన ఈవో

ABN , First Publish Date - 2022-12-07T23:23:51+05:30 IST

వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల సందర్భంగా పర్ణశాలలో ముక్కోటి ఏర్పాట్లను ఈవో శివాజీ బుధవారం పరిశీ లించారు.

ముక్కోటి ఏర్పాట్లను పరిశీలించిన ఈవో
ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఈవో

దుమ్ముగూడెం, డిసెంబరు 7: వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల సందర్భంగా పర్ణశాలలో ముక్కోటి ఏర్పాట్లను ఈవో శివాజీ బుధవారం పరిశీ లించారు. ఆలయ ప్రాంగణంలో నిర్మించిన చలువ పందిళ్లను పరిశీలించారు. శిధిలమైన కుటీరం పునర్నిర్మాణం, శని, ఆదివారాల్లో అన్నదానం, అన్నదానం ఏర్పాటుకు అవసరమైన భవన నిర్మాణం, యాత్రికుల సదనం మరమత్తులను ముక్కోటి అనంతరం చేపట్టేందుకు గల అవకాశాలను పరిశీలించారు. తెప్పో త్సవం సందర్భంగా హంసవాహనం అలంకరణ, లైటింగ్‌ ఏర్పాట్లపై చర్చిం చారు. ఎఫ్‌ఏసీ ఈఈ రవీందర్‌, సూపరింటెండెంట్‌ నిరంజన్‌కుమార్‌, సీసీ అనీల్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2022-12-07T23:23:55+05:30 IST