బంగారు కృతిక

ABN , First Publish Date - 2022-12-07T00:32:45+05:30 IST

గతనెలలో చండ్రుగొండ మండలం ఎర్రబోడులో పోడువివాదం నేపథ్యంలో గొత్తికోయల చేతిలో హతమైన రేంజర్‌ చలమల శ్రీనివాసరావు కుమార్తె కృతిక సబ్‌జూనియర్‌ అథ్లెటిక్స్‌లో సత్తా చాటి బంగారుపతకాన్ని కైవసం చేసుకుంది. హైదరాబాద్‌ గచ్చిబౌలిలో జరుగుతున్న తెలంగాణ సబ్‌జూనియర్‌ అథ్లెటిక్‌చాంపియన షిప్‌-2022 అండర్‌-10విభాగం లాంగ్‌జంప్‌లో ఆ

బంగారు కృతిక
రాష్ట్రస్థాయి సబ్‌జూనియర్‌ అథ్లెటిక్స్‌పోటీల్లో లాంగ్‌జంప్‌ చేస్తున్న ఎఫ్‌ఆర్‌వో కూతురు కృతిక

రాష్ట్రస్థాయి సబ్‌జూనియర్‌ అథ్లెటిక్స్‌లో సత్తాచాటిన రేంజర్‌ శ్రీనివాసరావు కూతురు

తండ్రి మరణ బాధను అధిగమించి అత్యుత్తమ ప్రతిభ

చుంచుపల్లి, డిసెంబరు 6: గతనెలలో చండ్రుగొండ మండలం ఎర్రబోడులో పోడువివాదం నేపథ్యంలో గొత్తికోయల చేతిలో హతమైన రేంజర్‌ చలమల శ్రీనివాసరావు కుమార్తె కృతిక సబ్‌జూనియర్‌ అథ్లెటిక్స్‌లో సత్తా చాటి బంగారుపతకాన్ని కైవసం చేసుకుంది. హైదరాబాద్‌ గచ్చిబౌలిలో జరుగుతున్న తెలంగాణ సబ్‌జూనియర్‌ అథ్లెటిక్‌చాంపియన షిప్‌-2022 అండర్‌-10విభాగం లాంగ్‌జంప్‌లో ఆమె సత్తా చాటింది. తండ్రి మరణించిన రెండు రోజులకే ఆ బాధను అధిగమించి గత నెల 25న కొత్తగూడెంలో జరిగిన భద్రాద్రి జిల్లాస్థాయి పోటీల్లో పాల్గొన్న కృతిక లాంగ్‌జంప్‌లో ప్రథమ, వందమీటర్ల పరుగుపందెంలో ద్వితీయస్థానం సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించింది. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని జీఎంసీ బాలయోగి అథ్లెటిక్స్‌ స్టేడియంలో రెండురోజులుగా జరుగుతున్న రాష్ట్ర సబ్‌ జూనియర్‌ అథ్లెటిక్స్‌ చాంపియనషిప్‌ పోటీల్లో భద్రాద్రి జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించి మంగళవారం జరిగిన లాంగ్‌జంప్‌ పోటీలో బంగారు పతకాన్ని సాధించింది. ఈ సందర్భంగా ద్రోణాచార్య అవార్డు గ్రహిత నేషనల్‌, జాతీయ శిక్షకులు నాగపురి రమేష్‌ మాట్లాడుతూ కృతికకు అథ్లెటిక్స్‌లో మంచి భవిష్యత ఉందని ప్రశంసించారు. రాష్ట్ర అథ్లెటిక్‌ అసోసియేషన అధ్యక్షుడు స్టానజోన్స సెక్రటరీ కే. సారంగపాణి కేపీసీ సంస్థ ప్రతినిధి మదిరాజ్‌ సాయిరతన, జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషన జనరల్‌ సెక్రటరీ కే. మహీధర్‌.. కృతిక, ఆమె కోచ మల్లికార్జునను అభినందించారు.

Updated Date - 2022-12-07T00:32:47+05:30 IST