బాబు సభను జయప్రదం చేయాలని ప్రచారం

ABN , First Publish Date - 2022-12-15T23:13:18+05:30 IST

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జ్ఞానేశ్వర్‌ ఆధ్వర్యంలో ఖమ్మం పట్టణంలో ఈనెల 21వ తేదీ నిర్వహించనున్న బహిరంగ సభకు ముఖ్య అతిఽధిగా తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు హాజరై మాట్లాడనున్నారని ఈ సభకు నియోజకవర్గం నుంచి వేలాదిగా దేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలి రా వాలని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ తాతా మాధవీలత కోరారు.

బాబు సభను జయప్రదం చేయాలని ప్రచారం
ప్రచారం నిర్వహిస్తున్న మాధవీ లత

మణుగూరు, డిసెంబరు 15: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జ్ఞానేశ్వర్‌ ఆధ్వర్యంలో ఖమ్మం పట్టణంలో ఈనెల 21వ తేదీ నిర్వహించనున్న బహిరంగ సభకు ముఖ్య అతిఽధిగా తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు హాజరై మాట్లాడనున్నారని ఈ సభకు నియోజకవర్గం నుంచి వేలాదిగా దేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలి రా వాలని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ తాతా మాధవీలత కోరారు. గురువారం తొలుత సీఎస్పీ వద్ద ఉన్న కనకదుర్గ ఆలయం వద్ద ప్రచార వాహనాలకు ప్రత్యేక పూజా కార్యాక్రమాలను నిర్వహించారు. అనంతరం మణుగూరు పట్టణంలో పలు వాహానాల ద్వారా మైక్‌ ప్రచారాలను సాగించారు. మణు గూరు పట్టణ ప్రాంతంలో బహిరంగ సభలకు చెందిన పాంప్లెట్‌లను పంపిణీ చేసి సభకు హాజరు కావాలని పట్టణ పరిసర వాసులను కోరారు, మణుగూరు పినపాక అశ్వాపురం, కరకగూడెం గుండాల ఆళ్లపల్లి బూర్గంపాడ్‌లలో బహి రంగ సభకు తరలిరండంటూ ప్రచారాలను విస్తృతంగా సాగిస్తున్నామని తెలి పారు. ఈ కార్యక్రమంలో సమితి సింగారం సర్పంచ్‌ బచ్చల భారతి, పసునూరి కృష్ణ, తెలుగుదేశం పార్టీ బీసీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి వి.మధుసూధనచారి, నా యకులు కూచుపూడి బాబు, ఉడతానే ని శ్రీను, మల్లిఖార్జున్‌, మానుకొండ ర ఘురాం, చందా మధు, మేధరమెట్ల శ్రీనివాస్‌రావు, రామారావు, పోశం రవి, త దితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-15T23:13:22+05:30 IST