డ్రైయినేజీలకు రెయిలింగ్‌ ఏర్పాటు

ABN , First Publish Date - 2022-01-19T04:48:11+05:30 IST

నగరంలోని ఎన్నెస్టీ రోడ్‌లో డ్రెయినేజీ వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతుండటంతో నగరపాలక సంస్థ అధికారులు డ్రెయినేజీ నిర్మాణానికి రెయిలింగ్‌ ఏర్పాటు చేశారు.

డ్రైయినేజీలకు రెయిలింగ్‌ ఏర్పాటు

ఖమ్మంకార్పొరేషన్‌, జనవరి18: నగరంలోని ఎన్నెస్టీ రోడ్‌లో డ్రెయినేజీ వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతుండటంతో నగరపాలక సంస్థ అధికారులు డ్రెయినేజీ నిర్మాణానికి రెయిలింగ్‌ ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలో డ్రెయినేజీ నిర్మాణం రహదారికి సమాంతరంగా ఉండటం, డ్రైయినేజీ పైన మూతలు లేకపోవటంతో వాహనదారులు అనేకసార్లు వాహనంతో సహా డ్రైయినేజీ కాలువలో పడిపోయారు. ఈ విషయమై గతంలో ‘ఆంధ్రజ్యోతి’లో కథనాలు ప్రచురితమయ్యాయి. దీనిపై స్పందించిన మేయర్‌ పునుకొల్లు నీరజ సదరు డ్రెయినేజీలను పరిశీలించారు. ఇంజనీరింగ్‌ అధికారులతో చర్చించి, డ్రైయినేజీ నిర్మాణం ఉన్నంత వరకు రెయిలింగ్‌ ఏర్పాటు చేయాలని సూచించారు. దీంతో అధికారులు రెయిలింగ్‌ నిర్మాణం చేపట్టారు. నిర్మాణం పూర్తయి, రంగులతో ఉన్న ఈ రెయిలింగ్‌తో డ్రైయినేజీ వద్ద ప్రమాదాలు తప్పాయి. వహనదారలు ఆందోళన లేకుండా వాహనాలను నడపగలుగుతున్నారు.

Updated Date - 2022-01-19T04:48:11+05:30 IST