ఇక రఘునాథపాలెం విద్యుత్‌ సబ్‌ డివిజన్‌

ABN , First Publish Date - 2022-07-06T05:12:22+05:30 IST

క రఘనాథపాలెం విద్యుత్‌ సబ్‌ డివిజన్‌గా మారనుంది. ఈమేరకు టీఎస్‌ఎన్‌పీడీసీఎల్‌ వరంగల్‌ విభాగం అధికారులు మంగళవారం సర్యూలర్‌ జారీచేశారు.

ఇక రఘునాథపాలెం విద్యుత్‌ సబ్‌ డివిజన్‌

రఘనాథపాలెం, జూలై5: ఇక రఘనాథపాలెం విద్యుత్‌ సబ్‌ డివిజన్‌గా మారనుంది. ఈమేరకు టీఎస్‌ఎన్‌పీడీసీఎల్‌ వరంగల్‌ విభాగం అధికారులు మంగళవారం సర్యూలర్‌ జారీచేశారు. వరంగల్‌ విద్యుత్‌ రీజియన్‌ పరిధిలో నూతనంగా ఆరుసబ్‌ డివిజన్లు ఏర్పాటు చేయగా వాటిలో రఘనాథపాలెం సబ్‌ డివిజన్‌ ఉంది. ఇక రఘనాథపాలెం సబ్‌ డివిజన్‌ పరిధిలోకి మంచుకొండ, బలేపల్లి, రఘనాథపాలెం విద్యుత్‌ సెక్షన్‌లు కలిపి సబ్‌ డివిజన్‌గా ఏర్పాటు చేస్తున్నారు. 

Read more