వేర్వేరు రోడ్డు ప్రమాదాలు: ముగ్గురికి గాయాలు

ABN , First Publish Date - 2022-09-14T04:42:28+05:30 IST

మండలంలోని రావినూ తలలోని వేబ్రిడ్జి వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమా దంలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి.

వేర్వేరు రోడ్డు ప్రమాదాలు: ముగ్గురికి గాయాలు

బోనకల్‌, సెప్టెంబరు 13: మండలంలోని రావినూ తలలోని వేబ్రిడ్జి వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమా దంలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. జానకీపురానికి చెందిన చిలకా వెంకటరత్నం స్ర్పేయర్‌ పంపును బాగు చేయించుకొనేందుకు కాలినడకన రోడ్డు దాటుతున్నాడు. ఈక్రమంలో బోనకల్‌ నుంచి లక్ష్మీపురం వైపు వెళ్తున్న ద్విచక్రవాహనంపై వెళ్తున్న నరేష్‌ అతడిని ఢీకొట్టాడు. దీంతో డీలర్‌ అపస్మారక స్థితిలోకి వెళ్లగా 108వాహనం ద్వారా ఖమ్మంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు నరేష్‌కు కూడా గాయాలు కాగా ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బోనకల్‌ క్రాస్‌రోడ్డు వద్ద జరిగిన మరో ప్రమాదంలో లారీ డ్రైవర్‌ గోపాలరావు తీవ్రంగా గాయపడ్డాడు. ఫోన్‌ మాట్లాడుతూ లారీ నడుపుతున్న క్రమంలో అదుపు తప్పి బోల్తాకొట్టింది. ఈ ప్రమాదంలో అతను తీవ్రంగా గాయపడగా 108లో మధిర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

Read more