రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు
ABN , First Publish Date - 2022-06-20T05:20:32+05:30 IST
రాళ్లవాగు సమీపంలో ప్రధాన రహదారిపై ఆదివారం జరిగిన రో డ్డు ప్రమాదంలో కంరకపల్లి సతీష్‌కు తీవ్ర గాయాలయ్యాయి.

ఈఎంటీ లేకపోవడంతో సమయానికి రాని 108
గంట సేపు ఇబ్బంది పడ్డ క్షతగాత్రుడు
పినపాక 108 ద్వారా ఆసుపత్రికి తర లింపు
కరకగూడెం, జూన్ 19: రాళ్లవాగు సమీపంలో ప్రధాన రహదారిపై ఆదివారం జరిగిన రో డ్డు ప్రమాదంలో కంరకపల్లి సతీష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన విష యాన్ని గుర్తించిన స్థానికులు 108కు సమాచారం అందించగా కరకగూడెం నుంచి వాహ నం వచ్చేందుకు గంట సమయం పట్టింది. ఈఎంటీ లేడని, సెన్సార్ పనిచేయడం లేదని 108 సిబ్బంది చెప్పడంతో బాధితుడి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గంట తరువా త క్షతగాత్రుడిని కరకగూడెం తరలించి ప్రాఽథమిక వైద్యాన్ని అందించారు. మెరుగైన వై ద్యం అందించేందుకు సతీష్‌ను మణుగూరు తరలించేందుకు 108 సహకరించక పోవడంతో పినపాక నుంచి 108 రప్పించాల్సి వచ్చింది.