బీఆర్‌ఎ్‌సతో కొత్త చరిత్ర

ABN , First Publish Date - 2022-10-07T06:26:55+05:30 IST

బీఆర్‌ఎ్‌సతో కొత్త చరిత్ర

బీఆర్‌ఎ్‌సతో కొత్త చరిత్ర
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి

ఏపీలోనూ పార్టీ విస్తరిస్తాం : మంత్రి పువ్వాడ

ఖమ్మం: భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) ఏర్పాటుతో దేశ రాజకీయాల్లో సీఎం కేసీఆర్‌ కొత్త చరిత్ర సృష్టించబోతున్నారని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. ఖమ్మంలోని తన క్యాంపు కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన విలేకరులసమావేశంలో ఆయన మాట్లాడారు.రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమపథకాలను దేశవ్యాప్తంగా అమలు చేయడంతో పాటు బీజేపీ అనుసరిస్తున్న ప్రైవేటీకరణ, మతోన్మాద రాజకీయాలను అడ్డుకునేందుకు బీఆర్‌ఎస్‌ ఆవిర్భవించిందన్నారు. ఈ పార్టీతో దేశంలో ఉన్న రాజకీయ శూన్యతను తొలిగించబోతోందని, అలాగే ప్రధాన ప్రతిపక్ష పాత్రను మరిచిన కాంగ్రెస్‌.. వారిలోవారే విమర్శించుకోవడం ద్వారా ప్రజల్లో విశ్వాసం కోల్పోయిందన్నా రు. ఎన్టీఆర్‌ టీడీపీని స్థాపించి తాను సీఎం అవడమే కాకుండా నేషనల్‌ ఫ్రంట్‌తో దేశరాజకీయాలలో కాంగ్రె స్‌కు ప్రత్యామ్నాయం చూపారని, లోక్‌సభలో కాంగ్రె్‌స కు ప్రధాన ప్రతి..పక్షంగా టీడీపీని నిలిపారని గుర్తుచేశారు. బీఆర్‌ఎ్‌సను అన్నిరాష్ట్రాల్లో విస్తరించి..కలిసి వచ్చే పార్టీలతో పొత్తులు పెట్టుకుంటామని, విలీనమయ్యేందుకు సిద్ధంగా ఉన్న వారిని కలుపుకొంటామన్నారు. పక్కరాష్ట్రమైన ఏపీలోనూ బీఆర్‌ఎ్‌సను విస్తరిస్తామని, ఒకరికి అనుకూలంగా మరొకరికి వ్యతిరేకంగా ఉండబోదన్నారు.ఒక్కడిగా అడుగువేసి టీఆర్‌ఎ్‌సను స్థాపించిన కేసీఆర్‌ రాష్ట్రాన్ని అభివృద్ధిలో మోడల్‌గా నిలిపారని, అదేస్ఫూర్తితో బీఆర్‌ఎ్‌సను స్థాపించి దేశరాజకీయాల్లో సరికొత్త మార్పునకు శ్రీకారం చుట్టారాన్నరు. ఆయనకు ఇప్పటికే పలు రాష్ట్రాలనుంచి మద్దతు కూడా వస్తోందని, కేసీఆర్‌ నేతృత్వంలో ఆత్మవిశ్వాస బలంతో బీఆర్‌ఎ్‌సను దేశంలో అధికారంలోకితేవడం ఖాయమన్నారు. ఈ విలేకరుల సమావేశంలో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన కొండబాల కోటేశ్వరారవు, ఖమ్మం మేయర్‌ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన బచ్చు విజయ్‌కుమార్‌, డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్లు కూరాకుల నాగభూషణం, రాయల శేషగిరిరావు, పార్టీ నగర అధ్యక్షుడు కమర్తపు మురళి, జిల్లా నాయకుడు గుండాల కృష్ణ పాల్గొన్నారు.

Updated Date - 2022-10-07T06:26:55+05:30 IST