గులాబీ వైపు ‘ఉభయుల’ చూపు

ABN , First Publish Date - 2022-08-21T07:24:12+05:30 IST

గులాబీ వైపు ‘ఉభయుల’ చూపు

గులాబీ వైపు ‘ఉభయుల’ చూపు

‘మునుగోడు’ పోరులో టీఆర్‌ఎస్‌తో పొత్తుకు సీపీఎం, సీపీఐ సంకేతాలు

‘అసెంబ్లీ ఎన్నికల ’ వ్యూహంలో భాగమేనన్న అభిప్రాయాలు

జిల్లా రాజకీయాలపై ప్రభావం

మునుగోడు ఎన్నికల పొత్తుల ప్రభావం జిల్లా రాజకీయాలపై కనిపిస్తోంది. అక్కడ త్వరలో జరగబోయే ఎన్నికల్లో టీఆర్‌ఎ్‌సకు సీపీఎం, సీపీఐలు మద్దతు సంకేతాలు ఇవ్వడం రాబోయే అసెంబ్లీ ఎన్నికల పొత్తు వ్యూహంలో భాగమేనని తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఐ టీఆర్‌ఎ్‌సతో పొత్తు పెట్టుకుని పోటీచేసింది. రాష్ట్రంలో ఇతర జిల్లాలో కంటే భిన్నంగా ఖమ్మం జిల్లాలో టీఆర్‌ఎస్‌ సీపీఐ పొత్తులు అవసరాన్నిబట్టి స్థానికంగా నడుస్తున్నాయి. ఖమ్మం కార్పొరేషన, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ పొత్తులు కలిసి వచ్చాయి. ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎ్‌సకు సీపీఐతో పాటు సీపీఎం కూడా మద్దతు తెలపనున్నట్టు సమాచారం. మతోన్మాద బీజేపీ గెలుపును అడ్డుకునేందుకు టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇవ్వక తప్పడం లేదని సీపీఎం వర్గాలు పేర్కొంటున్నాయి. మునుగోడు ఉప ఎన్నికల్లో ఉభయ కమ్యూనిస్టు పార్టీల మద్దతు నిర్ణయం భవిష్యత ఎత్తుగడలో భాగమేనని ప్రచారం జరుగుతోంది. 

ఖమ్మం, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): పొత్తులో భాగంగా సీపీఐ కొత్తగూడెం, వైరా స్థానాలు, సీపీఎం భద్రాచలం, మధిర  అసెంబ్లీ స్థానాలు కోరే అవకాశం ఉంది. మునుగోడు ఉప ఎన్నికల మద్దతు చర్చల్లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల పొత్తు విషయం కూడా చర్చకు వచ్చినట్టు సమాచారం. జాతీయస్థాయిలో బీజేపీ వ్యతిరేక లౌకిక కూటమిలో భాగంగా కలిసి పోటీచేద్దామని టీఆర్‌ఎస్‌ అధినేత సీఎం కేసీఆర్‌ వామపక్షాల నేతలకు సంకేతాలు ఇచ్చినట్టు వామపక్షనేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సీపీఎం, సీపీఐలు మునుగోడు ఉప ఎన్నికతో టీఆర్‌ఎ్‌సతో తాత్కాలిక స్నేహం కాకుండా శాశ్వత స్నేహబంధం బలపడే పరిస్థితి కనిపిస్తోంది. గతంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ఒక వెలుగు వెలిగాయి. స్వాతంత్య్రం అనంతరం కాంగ్రె్‌సతో పోరాడి సీపీఎం, సీపీఐలు బలమైన ఓటుబ్యాంక్‌తో అసెంబ్లీ లోక్‌సభ వంటి చట్టసభలు, స్థానిక సంస్థలు ఎన్నికల్లో విజయాలు సాధించి ఉమ్మడి రాష్ట్రంలో జిల్లాని కమ్యూనస్టుల కంచుకోటగా మార్చుకున్నాయి. ఆ తరువాత టీడీపీ ఆవిర్భావంతో జిల్లాలో సీపీఎం, సీపీఐలు దెబ్బతిన్నాయి. ఆ తర్వాత టీడీపీతో వ్యూహాత్మక పొత్తుతో ఉభయ కమ్యూనిస్టు పార్టీలు లాభపడ్డాయి. 1985 నుంచి 1999వరకు టీడీపీతో నడిచాయి. 1999లో టీడీపీ బీజేపీతో పొత్తుపెట్టుకోవడంతో మిత్రపక్షాలుగా ఉన్న టీడీపీ, సీపీఎం, సీపీఐలు విడిపోయాయి. 2004లో ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కాంగ్రె్‌సతో జతకట్టాయి. మళ్లీ 2009, 2014లో టీడీపీతో జతకట్టాయి. అయితే రాష్ట్ర విభజన తర్వాత టీడీపీ దెబ్బతినడంతో కమ్యూనిస్టు పార్టీలుకూడా నష్టపోయాయి. ఆ తరువాత సీపీఐ కాంగ్రె్‌సతో కలిసినా లాభం జరగలేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో రెండు కమ్యూనిస్టు పార్టీలకు జిల్లా నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ఈ పరిస్థితి సీపీఎం, సీపీఐలకు బాగా నష్టం కలిగించింది. రాబోయే రోజుల్లో మళ్లీ బపలడాలంటే టీఆర్‌ఎ్‌సతో పొత్తు తప్పదని భావించి తాజా రాజకీయ పరిస్థితి నేపథ్యంలో మునుగోడులో కలిసి ప్రయాణం సాగించబోతున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ కొత.్త పొత్తులు కమ్యునిస్టులకు ఏ మేర కలిసొస్తాయో వేచి చూడాలి.

Updated Date - 2022-08-21T07:24:12+05:30 IST