రోడ్ల నిర్మాణానికి రూ.67కోట్లు మంజూరు

ABN , First Publish Date - 2022-12-05T00:16:49+05:30 IST

సత్తుపల్లి నియోజకవర్గంలో ఆర్‌అండ్‌బీ రోడ్ల నిర్మాణానికి రూ.67కోట్లు మంజూరైనట్లు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తెలిపారు. ఆదివారం తల్లాడ మండలం నూతనకల్‌ గ్రామంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నియోజక వర్గంలోని తల్లాడ మండలానికి రూ.20కోట్లు, సత్తుపల్లికి రూ.18.60కోట్లు, కల్లూరుకు రూ.17కోట్లు, పెనుబల్లికి రూ.9కోట్లు, వేంసూరుకు రూ.2కోట్ల చొప్పున నిధులు మంజూరైనట్లు తెలిపారు.

రోడ్ల నిర్మాణానికి రూ.67కోట్లు మంజూరు

ఎమ్మెల్యే వెంకటవీరయ్య

తల్లాడ, డిసెంబరు 4: సత్తుపల్లి నియోజకవర్గంలో ఆర్‌అండ్‌బీ రోడ్ల నిర్మాణానికి రూ.67కోట్లు మంజూరైనట్లు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తెలిపారు. ఆదివారం తల్లాడ మండలం నూతనకల్‌ గ్రామంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నియోజక వర్గంలోని తల్లాడ మండలానికి రూ.20కోట్లు, సత్తుపల్లికి రూ.18.60కోట్లు, కల్లూరుకు రూ.17కోట్లు, పెనుబల్లికి రూ.9కోట్లు, వేంసూరుకు రూ.2కోట్ల చొప్పున నిధులు మంజూరైనట్లు తెలిపారు. త్వరలో తల్లాడ నుంచి రెడ్డి గూడెం, బస్వాపురం నుంచి పెద్దకోరుకొండి ఆర్‌అండ్‌బీ రోడ్లకు నిధులు మంజూరు చేయించనున్నట్లు తెలిపారు. లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్‌, కల్యాణలక్ష్మీ చెక్కులు పంపిణీ చేశారు. సంక్రాంతి కల్లా రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభించటం జరుగుతుందని ఎమ్మెల్యే వివరించారు. కార్యక్రమంలో డీసీఎంఎస్‌ చైర్మన్‌ రాయల వెంకటశేషగిరి రావు, ఎంపీపీ దొడ్డా శ్రీనివాస రావు, జడ్పీటీసీ దిరిశాల ప్రమీల, సొసైటీ చైర్మన్‌ రెడ్డెం వీరమోహన్‌రెడ్డి, రైతుబంధు మండల అధ్యక్షుడు దుగ్గిదేవర వెంకట్‌లాల్‌, ఏఎంసీ వైస్‌చైర్మన్‌ దూపాటి భద్రరాజు, సొసైటీ వైస్‌చైర్మన్‌ తూము వీరభద్రరావు, సర్పంచ్‌లు తూము శ్రీనివాసరావు, శీలం కోటిరెడ్డి పాల్గొన్నారు.

నర్సమ్మకు ఎంపీ, ఎమ్మెల్యే నివాళి

తల్లాడ, డిసెంబరు4: తల్లాడ మండలం గంగదేవి పాడు గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన రేగళ్ల నర్సమ్మకు ఆదివారం ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్‌ చైర్మన్‌ రాయల వెంకటశేషగిరిరావు, ఎంపీపీ దొడ్డా శ్రీనివాసరావు, సొసైటీ చైర్మన్‌లు శెట్టిపల్లి వెంకటేశ్వరరావు, రెడ్డెం వీరమోహన్‌రావు, రైతుబంధు మండల అధ్యక్షుడు దుగ్గిదేవర వెంకట్‌లాల్‌, తూము వీరభద్రరావు, బాణాల వెంకటేశ్వర్లు, సింహాద్రి యాదవ్‌, దిరిశాల దాసూరావు, దూపాటి భద్రరాజు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-05T00:16:52+05:30 IST