జిల్లాకు 104 పల్లెదవాఖానాలు మంజూరు

ABN , First Publish Date - 2022-11-17T00:04:39+05:30 IST

జిల్లాకు 104 హెల్త్‌ వెల్‌నెస్‌ సెంటర్లు (పల్లెదవాఖానాలు) మంజూర య్యాయని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ బి మాలతి తెలిపారు. వీటికి (ఎంఎల్‌హెచ్‌పీ )మిడ్‌లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్స్‌ పోస్టులను అర్హులైన ఎంబీబీఎస్‌, బీఏఎంఎస్‌ అఽభ్యర్థులను గతంలోనే విడతల వారీగా 64 పోస్టులను భర్తీ చేశామని మిగిలిన 40 పోస్టులను మంగళవారం నియామకపు ఉత్తర్వులు అందచేసినట్లు తెలిపారు.

జిల్లాకు 104 పల్లెదవాఖానాలు మంజూరు

డీఎంహెచ్‌వో డాక్టర్‌ మాలతి

ఖమ్మంకలెక్టరేట్‌, నవంబరు16: జిల్లాకు 104 హెల్త్‌ వెల్‌నెస్‌ సెంటర్లు (పల్లెదవాఖానాలు) మంజూర య్యాయని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ బి మాలతి తెలిపారు. వీటికి (ఎంఎల్‌హెచ్‌పీ )మిడ్‌లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్స్‌ పోస్టులను అర్హులైన ఎంబీబీఎస్‌, బీఏఎంఎస్‌ అఽభ్యర్థులను గతంలోనే విడతల వారీగా 64 పోస్టులను భర్తీ చేశామని మిగిలిన 40 పోస్టులను మంగళవారం నియామకపు ఉత్తర్వులు అందచేసినట్లు తెలిపారు. బుధవారం ఆమె విలేకరులకు వివరాలు వెల్లడించారు. మెత్తం 104 ఎంఎల్‌హెచ్‌పీ పోస్టులకు గాను ఎంబీబీఎస్‌ అర్హత కలిగిన అభ్యర్థులు 81 మంది, బీఏఎంఎస్‌ ఆయుష్‌ అభ్యర్థులు 23 మందిని జిల్లా ఎంపికల కమిటీ చైర్మన్‌ కలెక్టర్‌ ఆమోదంతో నియమిం చినట్లు ఆమె తెలిపారు. ఏడు బస్తీ దవాఖానాల్లో ఖాళీలు వైద్యాధికారులు, స్టాఫ్‌ నర్సుల పోస్టులను జిల్లా సెలక్షన్‌ కమిటీ ద్వారా నియమించినట్లు తెలిపారు. వైద్యాధికారులు, స్టాప్‌నర్స్‌ల పోస్టుల్లో ఈనెల 12న నియామకపు పత్రాలను అందించినట్లు వివరించారు. జిల్లాలో అన్ని పల్లెదవాఖానాల్లో పూర్తిస్థాయి సిబ్బందిని నియమించినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి బి మాలతి స్పష్టం చేశారు.

Updated Date - 2022-11-17T00:04:46+05:30 IST