డబుల్‌ ఇంజన్‌తో అభివృద్ధి, సంక్షేమం శూన్యం

ABN , First Publish Date - 2022-07-05T05:50:47+05:30 IST

బీజేపీ నేతలు అవలంబిస్తున్న డ బుల్‌ ఇంజన్‌తో జరిగిన అభివృద్ధి, సంక్షేమం శూన్యమని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. సోమవారం పట్టణంలోని వీకేబీ పంక్షన్‌ హాలులో ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

డబుల్‌ ఇంజన్‌తో అభివృద్ధి, సంక్షేమం శూన్యం
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి కొప్పుల ఈశ్వర్‌

- రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌

జగిత్యాల, జూలై 4 (ఆంధ్రజ్యోతి): బీజేపీ నేతలు అవలంబిస్తున్న డ బుల్‌ ఇంజన్‌తో జరిగిన అభివృద్ధి, సంక్షేమం శూన్యమని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. సోమవారం పట్టణంలోని వీకేబీ పంక్షన్‌ హాలులో ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. డబుల్‌ ఇంజన్‌ ప్రభుత్వం అంటున్న బీజేపీ నేతలు ఎక్కడ అభివృద్ది జరిగిందో చెప్పా ల న్నారు. దేశంలో 18 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ ఎక్కడ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందో ఒకసారి వెనక్కు తిరిగి చూసుకోవా లన్నారు. ప్రధాని మోదీ తెలంగాణలో జరిగిన అభివృద్ధిని గమనించి ప్ర శంసించాల్సింది పోయి విమర్శిస్తుండడం సరికాదన్నారు. ప్రధాని పర్యటన వల్ల రాష్ర్టానికి ఒరిగిందేమీ లేదన్నారు. కేవలం రాజకీయ స్వప్రయో జనాల కోసమే మోదీ పర్యటన సాగిందన్నారు. ఎనిమిదేళ్ల కాలంలో నరేం ద్ర మోదీ నేతృత్వంలో నిర్వహించిన ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమిటని అడిగిన ప్రశ్నలకు సమాధానాలు రావడం లేదన్నారు. హిందూ, ముస్లిం పేరిట బీజేపీ ఓట్లు దండుకోవడానికి ప్రయత్నిస్తోందన్నారు. బీజేపీ లాం టి ప్రభుత్వం దేశానికి ప్రమాదకరమన్నారు. డిజీలు, పెట్రోలు, గ్యాస్‌, ని త్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయినప్పటికీ కేంద్రం ప ట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా బీజేపీ నేతలు చౌకబారు మాటలు మాట్లాడవద్దన్నారు.  

తెలంగాణపై కేంద్రం వివక్షను వీడాలి

ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌

రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం వివక్షతతో వ్యవహరిస్తోందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌ అన్నారు. బీజేపీని ప్రజలు ఆదరిం చడం లేదన్నారు. హైద్రాబాద్‌లో బీజేపీ నిర్వహించిన జాతీయ కార్యవర్గ సమావేశాలు కేవలం తెలంగాణ సర్కారుపై విమర్శించడానికి పరిమిత మైందన్నారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమా లు దేశంలో మరెక్కడా జరగడం లేదన్నారు. ఈ సమావేశంలో జగిత్యాల జడ్పీ చైర్‌పర్సన్‌ దావ వసంత సురేశ్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బోగ శ్రావణి ప్రవీణ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-07-05T05:50:47+05:30 IST