భూ సర్వేకు తప్పని తిప్పలు

ABN , First Publish Date - 2022-03-05T06:38:00+05:30 IST

జిల్లాలో సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డు శాఖలో సమస్యలు తిష్ట వేశాయి. భూ సర్వేకు తిప్పలు తప్పడం లేదు.

భూ సర్వేకు తప్పని తిప్పలు

- సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డు శాఖలో తిష్ట వేసిన సమస్యలు

- పోస్టుల ఖాళీలతో ముందుకు సాగని పనులు

- నేషనల్‌ హైవే ఫోర్‌లైన్‌, గ్రామ సరిహద్దుల సర్వేకు అడ్డంకులు

- జిల్లాలో 318 దరఖాస్తులు పెండింగ్‌

జగిత్యాల, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డు శాఖలో సమస్యలు తిష్ట వేశాయి. భూ సర్వేకు తిప్పలు తప్పడం లేదు. అవసరమైన సంఖ్యలో సర్వేయర్లు లేకపోవడంతో పనులు వేగ వంతంగా కావడం లేదు. సగానికిపైగా కీలకమైన సర్వేయరు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జిల్లాలో జరపతలపెట్టిన 365 జాతీయ రహదారి వి స్తరణ సర్వే పనులు, నిజామాబాద్‌, నిర్మల్‌, కరీంనగర్‌, సిరిసిల్ల జిల్లాల ను ఆనుకొని ఉన్న గ్రామాల సరిహద్దు సర్వే పనులకు అడ్డంకులు ఏర్ప డుతున్నాయి. దీంతో పలు గ్రామాల్లో వివాదాలు పరిష్కారానికి నోచుకో వడం లేదు. సుమారు మూడు నెలలుగా జిల్లాలో వందల సంఖ్యలో భూ సర్వే దరఖాస్తులు పెండింగ్‌లో ఉంటున్నాయి. ప్రతీ నిత్యం దరఖా స్తు దారులు కార్యాలయాల చుట్టూ తిరుగుతూ విసిగి వేసారి పోతున్నారు.

జిల్లాలో పరిస్థితి...

జగిత్యాల జిల్లాలో సుమారు 7,05,922 ఎకరాల భూమి ఉంది. జిల్లాలో సర్వే నంబరులోని కొలతల రికార్డులను సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డు అధికారులు టిపన్‌గా సంబోదిస్తారు. దీని ప్రకారం జిల్లాలో 1,57,602 టిపన్‌లు ఉండల్సా ఉంది. ప్రస్తుతం జిల్లాలో సుమారు 97 వేలు మాత్రమే టిపన్‌లున్నాయి. సుమారు 60,602 టిపన్‌లు కనిపించ కుండా పోయాయి. సంబంధిత టిపన్‌లు ఎక్కడ ఉన్నాయి..వాటి సరి హద్దులు ఏమిటీ అన్న వివరాలు అందుబాటులో లేవు. అవసరమైన సర్వే జరిపితే కానీ జిల్లాలో పూర్తి టిపన్‌లను గుర్తించే అవకాశాలుం టాయి. ఇందుకు అవసరమైన అధికారులు, ఉద్యోగులు సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డు శాఖలో అందుబాటులో లేకపోవడం సమస్యలకు కారణంగా నిలుస్తోంది.

సగానికి పైగా సర్వేయర్‌ పోస్టులు ఖాళీ...

జిల్లాలో 18 మండలాలకు గానూ 18 సర్వేయరు పోస్టులు మంజూ రు అయ్యాయి. వీటికి తోడు ఒక జిల్లా సర్వే అధికారి, ముగ్గురు డీఐ పోస్టులున్నాయి. ఇందుకు గానూ జిల్లాలో ప్రస్తుతం జిల్లా సర్వే అధి కారి, ఇరువురు డీఐలు పనిచేస్తున్నారు. ఒకటి డీఐ పోస్టు ఖాళీగా ఉం ది. 18 మండలాలకు మంజూరు అయిన 18 సర్వేయర్‌ పోస్టులకు గా నూ ప్రస్తుతం 11 మంది మాత్రమే సర్వేయర్లున్నారు. 7 సర్వేయర్‌ పో స్టులు ఖాళీగా ఉన్నాయి. జిల్లాలో ప్రస్తుత ఉన్న 11 మంది సర్వేయ ర్లకు గాను 4 సర్వేయర్లు మెటర్నీటీ సెలవుల్లో వెళ్లారు. దీంతో ప్రస్తుతం జిల్లాలో పనిచేస్తున్న సర్వేయర్లు కేవలం 7 గురు మాత్రమే మిగిలారు.  పలువురు సర్వేయర్లకు ఒక్కక్కరికి రెండు, మూడు మండలాల బాధ్యత లను అప్పగిస్తున్నారు. అదనపు బాధ్యతలు అప్పగిస్తుండటంతో సర్వే యర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

పెండింగ్‌లో వందల సంఖ్యలో దరఖాస్తులు...

జిల్లాలో తమ భూ సరిహద్దుల సర్వే కోసం పలు గ్రామాలకు చెంది న వ్యక్తులు వందల సంఖ్యలో దరఖాస్తులు చేసుకున్నారు. జిల్లాలో ప్ర స్తుతం 316 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. సుమారు ఆరు నెలలు గా దరఖాస్తులు పరిష్కారానికి నోచుకోవడం లేదు. భూ సమస్యలు ఎ దుర్కొంటున్న పలువురు రైతులు, వ్యక్తులు ఆయా గ్రామాల్లో గల మీ సేవా కేంద్రాల ద్వారా భూ సర్వే కోసం దరఖాస్తు చేసుకున్నారు. నిబం ధనల ప్రకారం దరఖాస్తు చేసుకున్న 45 రోజుల్లోపు అధికారులు సర్వే చేసి సరిహద్దులు గుర్తించి మ్యాప్‌ను రూపొందించి దరఖాస్తు దారునికి అందించాలి. అయితే ఆరు నెలలుగా పలు దరఖాస్తులు పరిష్కారానికి నోచుకోవడం లేదు. దరఖాస్తుదారులు ప్రతీనిత్యం తహసీల్ధార్‌, ఆర్‌ డీవో, సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డు తదితర కార్యాలయాల చుట్టూ తిరిగి నిరుత్సాహా నికి గురవుతున్నారు.

ప్రభుత్వ పనులు సైతం పెండింగ్‌లో...

జిల్లాలో ప్రైవేటు వ్యక్తులు చేసుకున్న దరఖాస్తులు వందల సంఖ్యలో పెండింగ్‌లో ఉండటంతో పాటు పలు ప్రభుత్వ పనులకు సంబంధిం చిన సర్వే పనులు సైతం పూర్తి కావడం లేదు. జిల్లా సరిహద్దు ప్రాం తమైన ఇబ్రహీంపట్నం మండలం బండలింగాపూర్‌ శివారున గల గండి హనుమాన్‌ దేవస్థానం నుంచి వెళ్తున్న 365 జాతీయ రహదారి విస్తరణ పనులను నిర్వహించడానికి గానూ భూ సర్వే చేయాల్సి ఉంది. ఇందుకు గానూ గండి హనుమాన్‌ దేవస్థానం నుంచి మెట్‌పల్లి, కోరు ట్ల, మేడిపల్లి, జగిత్యాల, కొండగట్టు, కొడిమ్యాల మండలం పూడూరు వరకు నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణానికై సర్వే పనులు నిర్వహించాల్సి ఉంది. సిబ్బంది కొరత కారణంగా సర్వే పనులు చేయడం లేదు. దీనికితోడు సమీప ప్రాంతాలయిన నిజామాబాద్‌, నిర్మల్‌, కరీంనగర్‌, సిరిసిల్ల తదితర జిల్లాల సరిహద్దుల్లో గల పలు గ్రామాల్లో భూ సమ స్యలున్నాయి. సంబంధిత జిల్లా సరిహద్దు గ్రామాల భూ సమస్యల ప రిష్కారానికి సర్వేలు నిర్వహించాల్సి ఉండగా అంతంతమాత్రంగానే జ రుగుతున్నాయి. జిల్లాలో కొనసాగుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు, ఇతర ప్రా జెక్టులకు సంబందించి భూ సర్వేలు సైతం నిర్వహించడానికి సర్వే అం డ్‌ ల్యాండ్‌ రికార్డు శాఖలో నెలకొన్న ఖాళీ పోస్టుల సమస్యలు వేధిస్తు న్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో భూ సమస్యలు పరిష్కారానికి నోచు కోక పోవడంతో భూ పంచాయతీలు తీవ్రతరమవుతున్నాయి. భూ సమస్య లు పరిష్కారం కాకపోవడంతో ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బం ధు, రైతు బీమా లాంటి పథకాలకు అర్హులము కాలేకపోతున్నామని పలువురు దరఖాస్తులు దారులు వాపోతున్నారు.


సమస్యల పరిష్కారానికి కృషి

- వెంకట్‌ రెడ్డి, ఏడీ, సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డు శాఖ, జగిత్యాల

జిల్లాలో సర్వే అండ్‌ భూ రికార్డు శాఖలో అవసరం మేరకు సర్వేయ ర్లు లేరు. పలు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పలువురు సర్వేయర్లు మె టర్నీటీ సెలవుల్లో ఉన్నారు. దీంతో పలు దరఖాస్తులను పరిష్కరించడం లో కొంత జాప్యం ఏర్పడుతోంది. అయినప్పటికీ దరఖాస్తు దారుల సమస్యలను సాధ్యమైనంత తొందరలో పరిష్కరింపజేయడానికి అవస రమైన కృషిని చేస్తున్నాం.


Read more