ఇష్టారాజ్యంగా పనులు
ABN , First Publish Date - 2022-12-15T00:57:34+05:30 IST
జిల్లా కేంద్రంలో నత్త నడకన జరుగుతున్న పనులు, కూలీ చార్జీల పేరుతో అక్రమ వసూళ్లతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడు తున్నారు. స్మార్ట్‌సిటీ, పట్టణ ప్రగతి, ఆర్థిక సంఘం, మున్సిపల్ జనరల్ ఫండ్ ఇలా వివిధ రకాల నిధులతో నగరంలో ఏ డివిజన్లో చూసినా పనులు దర్శనమిస్తు న్నాయి. ఒక డివిజన్లో సీసీ రోడ్డు, మరోచోట డ్రైనేజీ, ఇంకో చోట పైపులైను, ఫుట్‌పాత్, పార్కు పనులు ఇలా అభివృద్ధి పనులు జరుగుతూనే ఉన్నాయి.
కరీంనగర్ టౌన్, డిసెంబరు 14: జిల్లా కేంద్రంలో నత్త నడకన జరుగుతున్న పనులు, కూలీ చార్జీల పేరుతో అక్రమ వసూళ్లతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడు తున్నారు. స్మార్ట్‌సిటీ, పట్టణ ప్రగతి, ఆర్థిక సంఘం, మున్సిపల్ జనరల్ ఫండ్ ఇలా వివిధ రకాల నిధులతో నగరంలో ఏ డివిజన్లో చూసినా పనులు దర్శనమిస్తు న్నాయి. ఒక డివిజన్లో సీసీ రోడ్డు, మరోచోట డ్రైనేజీ, ఇంకో చోట పైపులైను, ఫుట్‌పాత్, పార్కు పనులు ఇలా అభివృద్ధి పనులు జరుగుతూనే ఉన్నాయి.
ఫ నత్తనడకన..
పనులను ప్రారంభించి ఐదేళ్లు దాటినా ఇప్పటి వరకు ఎక్కడా పూర్తికాలేదు. రెండో విడతలో టెండర్లు పిలిచిన తొమ్మిది పనులు ప్రారంభానికి కూడా నోచుకోలేదు. ప్రారంభించిన పనులు ఎప్పటికి పూర్తవుతాయో తెలియని పరిస్థితి. సాంకేతిక పరమైన సీసీ కెమెరాలు, ట్రాఫిక్ సిగ్నలింగ్, జిబ్రా క్రాసింగ్, సైన్ బోర్డులు, స్మార్ట్ క్లాస్ రూమ్‌లు, స్మార్ట్ డస్ట్‌బిన్స్, డిజిటల్ లైబ్రరీ నిర్మాణ పనుల్లో కొన్నింటి మాత్రమే పూర్తి చేయగా మరికొన్ని పనులు నత్తనడకన సాగుతున్నాయి. నగర నడిబొడ్డున ఉన్న టవర్‌సర్కిల్‌లో స్మార్ట్‌సిటీ పనుల్లో భాగంగా చేప డుతున్న రోడ్లు, డ్రైనేజీలు, ఫుట్‌పాత్ నిర్మాణ పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీంతో నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతానికి వచ్చే ప్రజలు నానా ఇబ్బందులను ఎదు ర్కొంటున్నారు. మంత్రి గంగుల కమలాకర్, మేయర్ సునీల్‌రావు, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్‌తో కలిసి పలుమార్లు సందర్శించి రెండు నెలల్లో పూర్తి చేయాలంటూ గడువు విధించినా పనులు వేగవంతం కాలేదు. దీంతో వ్యాపారాలు పూర్తిగా దెబ్బ తింటున్నాయని వ్యాపారస్తులు ఆందోళన చెందుతున్నారు.
ఫ చార్జీల పేరుతో డబ్బుల వసూళ్లు
సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులు జరుగుతున్న ప్రాంతాల్లో యూజీడీ ఛాంబర్లకు ఇంటర్ కనెక్షన్లు, నల్లా కనెక్షన్లను తొలగించి కొత్త కనెక్షన్లు ఇచ్చేందుకు, రోడ్డు విస్తరణలో భాగంగా ప్రస్తుతం ఇళ్లు, దుకాణాల ముందు వరకు ఉన్న స్లాబ్‌లను, మెట్లను తొలగించి తిరిగి వేసేందుకు కూలి చార్జీల పేరిట ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్నారు. అభి వృద్ధి పనుల్లో ఆ పనులు భాగమే కావడంతో కూలీ చార్జీ లు ఇస్తే చాలనీ అధికారులు చెబుతున్నప్పటికీ క్షేత్ర స్థాయిలో పైపులు, రీ కనెక్షన్లు పేరిట వేలాది రూపాయ లను వసూలు చేస్తున్నారు. ఈ పనులు ఎందుకు చేస్తు న్నారోగానీ వేలాది రూపాయలు ఇప్పటికిప్పుడు తేవడం కష్టమవుతోందని పేద, మద్యతరగతి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు నెలల తరబడి ఇళ్లు, దుకాణాల ముందు కాలువల కోసం తవ్వి వదిలి వేయడంతో దానిపై స్లాబ్ వేసేందుకు డబ్బులు వసూలు చేస్తున్నారని, లేనిపక్షంలో కాలువ తవ్వి వదిలివేయడంతో ఇబ్బంది పడాల్సి వస్తోం దని వ్యాపారులు అంటున్నారు. స్మార్ట్‌సిటీ పనుల్లోనే కాకుండా ఇతర నిధులతో చేపడుతున్న పనుల్లో కూడా తీవ్ర జాప్యం చేయడం, కూలీ చార్జీల పేరుతో ఇంటి యజ మానుల నుంచి ఇష్టారాజ్యంగా డబ్బులు వసూలు చేస్తు న్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కార్పొరేటర్లు చెప్పినా పని చేసే వారు వేలల్లోనే డబ్బులు వసూలు చేస్తున్నా రని, కార్పొరేటర్లను కూడా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. కొంత మంది కార్పొరేటర్లు కాంట్రాక్టర్లపై ఒత్తిడి తెచ్చినా లేబర్ చార్జీల పేరుతో అక్రమ వసూళ్ల దందా ఆగడం లేదు. డబ్బుల వసూళ్లపై ప్రజలు, కార్పొ రేటర్లు సంబంధిత ఇంజనీరింగ్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, కాంట్రాక్టర్, లేబర్లు కుమ్మ క్కై డబ్బులు వసూలు చేస్తుంటే చోద్యం చూస్తున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. కరీంనగర్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట ద్వారకానగర్ గల్లీలో ప్రతి ఇంటి నుంచి యూజీడీ, డ్రైనేజీ పైపులు, ఇంటర్కనెక్షన్లు, నల్లా రీ కనెక్షన్ల పేరుతో వేలల్లోనే డబ్బులు వసూలు చేశారని కాలనీ వాసులు వాపోతున్నారు.
ఫ నాసిరకం పనులు
నగరంలో చేపడుతున్న మున్సిపల్, ఆర్అండ్బీ నిర్మాణ పనుల్లో నాణ్యతకు తిలోదకాలిస్తున్నారని,నాసిరకం పనులు చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నగరంలోని 14.5 కి.మీ ఆర్ అండ్‌బీ ప్రధాన రహ దారులు అభివృద్ధి చేసిన కొద్ది నెలలకే అక్కడకక్కడ గుంతలు పడడడం, ఫుట్ పాత్‌లు, డ్రైనేజీలు కూలిపోవడం నాణ్యత లేమికి నిదర్శనంగా చెబుతు న్నారు. ఇటీవల 19వ డివిజన్లో సీసీ రోడ్డు, డ్రైనేజీ పనుల కోసం పాత రోడ్డును తవ్వి కొత్తగా మోరం పోసి చదను చేయాల్సి ఉండగా కూల్చిన డ్రైనేజీ బండ రాళ్లను, మట్టిని తీసు కొచ్చి కొత్తగా వేసే రోడ్డుపై వేయడం చూసి కాలనీవాసులు ఆశ్చర్యానికి గుర య్యారు. దీనిపై నిలదీస్తే పనులు ఇలా గే చేస్తామంటూ కాంట్రాక్టర్, సం బంధిత ఇంజనీరింగ్ సిబ్బంది సమా ధానమివ్వడంతో చేసేది లేక కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.
ఇలా నగరంలో అభివృద్ధి పనులు ప్రజలకు ఎప్పుడు సంతోషాన్ని ఇస్తా యోగానీ ఇప్పుడు మాత్రం అడుగడు గునా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా నగరం లోని ప్రధాన రోడ్లతో పాటు అంతర్గత లింక్ రోడ్లు, అంతర్గత రోడ్లు సీసీగా మార్చడంతో అభివృద్ధిని చూసి తాత్కా లికంగా వస్తున్న కష్టాలను లెక్క చేయ డం లేదు. ఇంజనీరింగ్ అధికారులు పనులు జరిగే ప్రాంతాలకు వెళ్లి ప్రజ లకు కష్టం జరుగకుండా, ఎలాంటి అక్ర మ వసూళ్లకు ఆస్కారం లేకుండా పనులు త్వరగా పూర్తయ్యేలా చూడా లని ప్రజలు కోరుతున్నారు.