పనులు త్వరగా పూర్తి చేయాలి
ABN , First Publish Date - 2022-12-16T23:46:15+05:30 IST
మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన నిర్మాణపనులను త్వరగా పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ మకరందు అధికారులను అదేశించారు.
అదనపు కలెక్టర్ (స్థానికసంస్థలు) మకరందు
రాయికల్, డిసెంబరు 16: మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన నిర్మాణపనులను త్వరగా పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ మకరందు అధికారులను అదేశించారు. శుక్రవారం రాయికల్ పట్టణంతో పాటు కుమ్మరిపెల్లి, భూపతిపూర్ గ్రామాలలో జరుగుతున్న మన ఊరు మన బడి కార్యక్రమంలో చేపట్టిన పనులను ఆయనపరిశీలించారు. ఈసందర్భంగా పనుల ప్రగతిపై సంబంధిత అధికారులను, స్థానిక ప్రజాప్రతినిధులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. రాయికల్ పట్టణంలో ఏర్పాటు చేయనున్న సమీకృ త మార్కెట్ స్థలాన్ని పరిశీలించారు. త్వరగా పనులు ప్రారంభించాలని అధికా రులను ఆదేశించారు. మండలంలోని భూపతిపూర్, కుమ్మరిపెల్లి గ్రామాలలో తెలంగాణా క్రీడా ప్రాంగణాల పనులను సైతం ఆయన పరిశీలించారు. వీరి వెంట మున్సిపల్ చైర్మన్ మోర హన్మాడ్లు, వైస్ చైర్మన్ గండ్ర రమాదేవి, కమీషనర్ గంగుల సంతోష్‌కుమార్, సర్పంచులు స్వప్న, జక్కుల చంద్రశేఖర్, డీఈ అభినవ్‌కుమార్ ఉన్నారు.
మున్సిపల్ సిబ్బందితో సమీక్ష
రాయికల్ మున్సిపల్ సిబ్బందితో అదనపు కలెక్టర్ మకరందు సమీక్ష నిర్వ హించారు. పట్టణంలో పారిశుధ్యం, హరితహారం, టౌన్‌ప్లానింగ్, భవన నిర్మా ణం, వైకుంఠదామం పనులు, టీయుఎఫ్ఐడీసీ నిధులు, పట్టణ ప్రగతి, టాక్స్ వసూళ్లు, బస్తీ దావఖాన పనులపై సమీక్ష నిర్వహించారు. వీరివెంట కమీష నర్ సంతోష్‌కుమార్, మేనేజర్ వెంకటి ఉన్నారు.