మహిళలు ఆర్థికంగా మరింత బలోపేతం కావాలి

ABN , First Publish Date - 2022-03-05T06:41:11+05:30 IST

మహిళలు ఆర్థికంగా మరింత బలోపేతం కావాలని బల్దియా చైర్‌ పర్సన్‌ బోగ శ్రావణి అన్నారు.

మహిళలు ఆర్థికంగా మరింత బలోపేతం కావాలి
సమావేశంలో మాట్లాడుతున్న శ్రావణి

జగిత్యాల బల్దియా చైర్‌ పర్సన్‌ బోగ శ్రావణి

జగిత్యాల టౌన్‌, మార్చి 4 : మహిళలు ఆర్థికంగా మరింత బలోపేతం కావాలని బల్దియా చైర్‌ పర్సన్‌ బోగ శ్రావణి అన్నారు. జిల్లా కేంద్రంలోని 11వ, వార్డులో పలు మహిళా సంఘాల సభ్యులతో చైర్‌ పర్సన్‌  శుక్రవా రం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అనంతరం శ్రావణి మాట్లాడు తూ పట్టణంలోని అన్ని గృహాల యజమానులకు తడి, పొడి చెత్త సేకర ణపై మహిళా సంఘాల సభ్యులు అవగాహన కల్పించి చెత్త రహిత ప ట్టణంగా జగిత్యాలను తీర్చిదిద్దాలన్నారు. హరితహారం కార్యక్రమంలో నాటిన మొక్కలను సంరక్షించాలని పిలుపునిచ్చారు. అనంతరం బల్దియా సమావేశ మందిరంలో మెప్మా సిబ్బంది, రిసోర్స్‌ పర్సన్లతో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలపై ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్‌ స్వరూప రాణి, ఏవో శ్రీనివాస్‌ గౌడ్‌, డీఎంసీ సునిత, టీఎంసీ రజిత, స్త్రీనిధి మేనేజర్‌ మారుతి, కౌన్సిలర్‌ బాలె లత తదితరులు ఉన్నారు.

Read more