దళితబంధు పథకంతో ఆర్థికాభివృద్ధి సాధించాలి

ABN , First Publish Date - 2022-12-10T00:18:59+05:30 IST

దళితబంధు పథకం దళితుల జీవితా ల్లో వెలుగులు నింపే గొప్ప పథకమని, దళితులు సద్వినియోగం చేసు కొని ఆర్థికాభివృద్ధి సాధించాలని కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ అన్నారు.

దళితబంధు పథకంతో   ఆర్థికాభివృద్ధి సాధించాలి
హుజూరాబాద్‌లో లబ్ధిదారుడిని వివరాలు అడిగి తెలుసుకుంటున్న కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌

హుజూరాబాద్‌, డిసెంబరు 9: దళితబంధు పథకం దళితుల జీవితా ల్లో వెలుగులు నింపే గొప్ప పథకమని, దళితులు సద్వినియోగం చేసు కొని ఆర్థికాభివృద్ధి సాధించాలని కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ అన్నారు. శుక్రవారం హుజూరాబాద్‌ పట్టణంలో దళితబంధు పథకం కింద గ్రౌండింగ్‌ చేసిన సుహాస్‌ ఏజెన్సీస్‌ ఏషియన్‌ పేయింట్స్‌, చంద్రకళ స్టీల్‌ అండ్‌ ఎంటర్‌ ప్రైజస్‌, పోచయ్య హోటల్‌ టిఫిన్స్‌ అండ్‌ పాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌లను ఆయ న పరిశీలించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో యూనిట్ల అభివృద్ధి, లాభాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ మా ట్లాడుతూ దళిత బంధు యూనిట్లను మరింత అభివృద్ధి చేసుకోవడంతో పాటు మరి కొందరికి ఉపాధి కల్పించేలా ఎదగాలన్నారు. మొదటి దశలో యూనిట్లను గ్రౌండింగ్‌ చేసేందుకు సగం డబ్బులు ఇచ్చామని, మిగిలిన మొత్తం డబ్బులు మంజూరు చేయాలని ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీని కలెక్టర్‌ ఆదేశించారు. లబ్ధిదారులు స్వయం కృషితో యూనిట్లను బాగా అభివృద్ధి చేసుకోవాలని, మరికొంత మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాల న్నారు. సమాజంలో దళితులు ఉన్నత వర్గాలకు దీటు గా ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఆర్డీవో హరిసింగ్‌, ఎస్సీ కార్పొరేషన్‌ ప్రత్యేకాధికారి సురేష్‌, ఈడీ నాగార్జున, మున్సిపల్‌ కమి షనర్‌ సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

కేబుల్‌ బ్రిడ్జి పనుల పరిశీలన

కరీంనగర్‌ టౌన్‌: కేబుల్‌ బ్రిడ్జి అప్రోచ్‌ రోడ్డు పనులను వారం రోజు ల్లోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ కాంట్రాక్టర్లను, అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆర్‌అండ్‌బి అధికారులు, కాంట్రాక్టర్లతో కలిసి కేబుల్‌ బ్రిడ్జి అప్రోచ్‌ రోడ్డు పనులను కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తీగల వంతెన అప్రోచ్‌ రోడ్డు నిర్మాణ పనులను వారం రోజుల్లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌అండ్‌బీ ఈఈ సాంబశివరావు, మున్సిపల్‌ కమిషనర్‌ సేవా ఇస్లావత్‌, తహసీల్దార్‌ సుధాకర్‌, ఆర్‌అండ్‌బీ ఏఈలు, మున్సిపల్‌ అధికారులు, కాంట్రాక్టర్‌ కమాలుద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-10T00:19:01+05:30 IST