సీఎం సభలో నిరసన వ్యక్తం చేస్తాం
ABN , First Publish Date - 2022-12-07T00:36:31+05:30 IST
వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలోని అనేక పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం ప్రజలు పెద్ద ఎత్తున జగిత్యాలకు తరలివచ్చి సీఎం కేసీఆర్ సభలో ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు.
వేములవాడ, డిసెంబరు 6: వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలోని అనేక పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం ప్రజలు పెద్ద ఎత్తున జగిత్యాలకు తరలివచ్చి సీఎం కేసీఆర్ సభలో ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన వేములవాడలో విలేకరులతో మాట్లాడారు. 2014 సంవత్సరం నుంచి ఇప్పటివరకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చనందుకు ప్రజలు, కాంగ్రెస్ శ్రేణులు నిరసన తెలపాలని కోరారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానానికి ఏటా వందకోట్ల రూపాయలు నిధులను కేటాయిస్తామని స్వామి వారికే శఠగోపం పెట్టాడన్నారు. ఈ విషయమై బ్రాహ్మణ సంఘం నాయకులు, భక్తులు నిరసన తెలపాలని కోరారు. మిడ్మా నేరు ముంపు గ్రామాల సమస్యలు ఇప్పటికీ పరిష్కరించలేదన్నారు. వేము లవాడ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ వేము లవాడలో వంద కోట్ల కుంభకోణం జరిగినట్లు చేసిన ఆరోపణలను ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ నిరూపించాలని, అవసరమైతే ఇందుకోసం ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటు చేయాలని అన్నారు. సమావేశంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాగుల సత్యనారాయణ, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సాగరం వెంకటస్వామి, పిల్లి కనకయ్య, పాత సత్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.