శిక్షణ ఐఏఎస్‌లకు పాఠ్యాంశంగా నీటి సంరక్షణ విధానాలు

ABN , First Publish Date - 2022-02-19T06:28:50+05:30 IST

జిల్లాలోని నీటి సంరక్షణ విధానాలు ట్రైనీ ఐఏఎస్‌లకు శిక్షణ ఇచ్చే లాల్‌బహదూర్‌శాస్త్రీ అకాడమీలో పాఠ్యంశాలుగా మారడం జిల్లాకే గర్వకారణమని ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కె. తారకరామారావు అన్నారు. శుక్రవారం తంగళ్లపల్లి మండలం బద్దనపల్లిలో రైతు వేదికను ప్రారంభించారు.

శిక్షణ ఐఏఎస్‌లకు పాఠ్యాంశంగా నీటి సంరక్షణ విధానాలు
మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్‌

తంగళ్లపల్లి, ఫిబ్రవరి 18: జిల్లాలోని నీటి సంరక్షణ విధానాలు ట్రైనీ ఐఏఎస్‌లకు శిక్షణ ఇచ్చే లాల్‌బహదూర్‌శాస్త్రీ అకాడమీలో పాఠ్యంశాలుగా మారడం జిల్లాకే గర్వకారణమని ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కె. తారకరామారావు అన్నారు. శుక్రవారం తంగళ్లపల్లి మండలం బద్దనపల్లిలో రైతు వేదికను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్థవంతమైన, లాభాసాటి వ్యవసాయం చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి అనేక రైతు సంక్షేమ పథకాలను దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలో ప్రవేశపెట్టారన్నారు.  రైతులను సంఘటితం చేయాలనే సంకల్పంతో రాష్ట్రంలో 2603 రైతు వేదికలు ఏర్పాటు చేశామన్నారు.  గోదావరి జలాలతో జిల్లాలో మిడ్‌ మానేరు, అన్నపూర్ణ రిజర్వాయర్‌లు కళకళాలాడుతున్నాయని,  ఆరు మీటర్లు పైకి భూగర్భ జలాలు ఉబికి వచ్చాయని అన్నారు.   ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌, ఎమ్మెల్సీ భానుప్రసాద్‌రావు, నాఫ్స్‌కాబ్‌ చైర్మన్‌ కొండూరు రవీందర్‌రావు, జడ్పీ చైర్మన్‌ న్యాలకొండ అరుణ, జిల్లా రైతుబంధు కో ఆర్డినేటర్‌ గడ్డం నర్సయ్య, కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి, గ్రంథాలయ చైర్మన్‌ అకునూరి శంకరయ్య, ఎంపీపీ పడిగెల మానస రాజు, జడ్పీటీసీ పుర్మాణి మంజుల లింగారెడ్డి, రైతుబంధు మండల కో ఆర్డినేటర్‌ కొమ్మట రాజిరెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ సింగిరెడ్డి రవీందర్‌రెడ్డి, స్థానిక ఎంపీటీసీ చిలువేరి ప్రసూన నర్సయ్య, వ్వవసాయ శాఖాధికారి సందీప్‌, ఫ్యాక్స్‌ చైర్మన్లు బండి దేవదాస్‌, కొడూరి భాస్కర్‌గౌడ్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు గజభీంకర్‌ రాజన్న, ఎంపీటీసీలు, సర్పంచులు, నాయకులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-02-19T06:28:50+05:30 IST