వాల్టా చట్టం ఉల్లంఘన

ABN , First Publish Date - 2022-04-25T06:46:46+05:30 IST

నీటిని అవసరాలకు మించి వాడుతుండడం...అనుమతి లేకుండా ఇష్టారీతిన బోర్ల తవ్వకాలు జరప డం వంటివి భవిష్యత్తు ప్రమాదాన్ని సూచిస్తున్నప్పటికీ పలువురు నిర్ల క్ష్యం వహిస్తున్నారు.

వాల్టా చట్టం ఉల్లంఘన

అనుమతి లేని తవ్వకాలు

పట్టించుకోని అధికారులు

జిల్లాలో విచ్చలవిడిగా బోర్లు

జగిత్యాల, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి): నీటిని అవసరాలకు మించి వాడుతుండడం...అనుమతి లేకుండా ఇష్టారీతిన బోర్ల తవ్వకాలు జరప డం వంటివి భవిష్యత్తు ప్రమాదాన్ని సూచిస్తున్నప్పటికీ పలువురు నిర్ల క్ష్యం వహిస్తున్నారు. నీటి పొదుపును పాటిస్తున్నాం...నీటి ఎద్దడి రాకుం డా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాం...వాల్టా చట్టాన్ని పక్కాగా అమలు చేస్తున్నామంటూ పాలకులు, అధికారులు ప్రచారం చేస్తున్నప్ప టికీ క్షేత్ర స్థాయిలో కనిపించడం లేదు. జిల్లాలో పలువురు ఇష్టారీతిగా బోర్ల తవ్వకాలు జరుపుతున్నారు. ఫలితంగా వాల్టా చట్టం ఉల్లంఘనకు గురవుతోంది. భూగర్భ జలాలను కాపాడుకోడానికి అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2002లో నీరు, భూమి, వృక్షాల ప్రత్యేక చట్టాన్ని తీసుకవచ్చింది. 

వాల్టా చట్టం ఇలా...

నీరు, భూమి, వృక్షాల సంరక్షణకు రూపొందించిన ప్రత్యేక చట్టాన్ని పక్కాగా అమలు చేయాల్సిన అవసరముంది. వాటర్‌ ల్యాండ్‌ ట్రీస్‌ ఆక్ట్‌ (వాల్టా)గా రూపొందించిన చట్టాన్ని పట్టించుకోవడం లేదు. ఈ చట్టం బోరు బావులకు సంబంధించిన అనేక నిబంధనలను తయారు చేసింది. ఎవరైనా సరే బోరు బావి తవ్వుకోవాలంటే ముందుగా ప్రభుత్వ అనుమ తి తీసుకోవాలి. సర్వే నంబరు ఆధారంగా రెవెన్యూ సిబ్బంది బోరు వేసే ప్రాంతాన్ని పరిశీలిస్తారు. తదుపరి ఆ అప్లికేషన్‌ను భూగర్భ జల వనరు ల శాఖకు పంపుతారు. అక్కడి టెక్నికల్‌ అధికారి సర్వే చేసి ఆ ప్రాంతం లో నీరు పడుతాయని దృవీకరిస్తే అప్పుడు బోరు వేసుకోవడానికి అను మతినిస్తారు. ఒక వేళ బావిలో నీరు పడకపోతే ఆ బావిని పూర్తిగా పూ డ్చివేయాలి. ఇంత పకడ్బందీగా  వాల్టా చట్టం రూపొందించినప్పటికీ ప లువురు పట్టించుకోవడం లేదు. ఇంట్లో వేసుకునే బోర్లకు సైతం అను మతి తీసుకోవాల్సి ఉంటుంది.

నిబంధనలు గాలికి...

పక్కాగా రూపొందించిన వాల్టా చట్టం ఉల్లంఘనకు గురవుతోంది. నిబంధనల ప్రకారం ఒక బోరు తవ్వాలంటే ముందుగా సంబంధిత మండలాల తహసీల్దార్ల వద్ద అనుమతి తీసుకోవాల్సి ఉన్నప్పటికీ పట్టిం చుకోవడం లేదు. రెవెన్యూ, భూగర్బ జల శాఖ అధికారులను సంప్ర దించి అనుమతులు తీసుకున్న తర్వాత బోరు తవ్వాల్సి ఉంటున్నప్పటికీ అమలుకావడం లేదు. ఎడా పెడా బోర్లు వేయడం వల్ల వాల్టా ఉల్లం ఘనకు గురవుతోంది. పంట పొలాల్లో వేసే బోర్లతో పాటు ఇళ్లలో వేస్తు న్న బోర్ల తవ్వకాలకు కచ్చింతంగా అనుమతి తీసుకోవాలన్న నిబంధన ఉన్నప్పటికీ ఎక్కడా పాటించడం లేదు. బోరు తవ్వకం కోసం ఒక్క దరఖాస్తు కూడా రాలేదని ఆశాఖల అధికారులు అంటున్నారు. నీళ్ల వాడకం, చెట్లను కాపాడుకోడానికి తీసుకవచ్చిన చట్టాన్ని నిర్వాహకులు పట్టించుకోవడం లేదు. ఇంతకు ముందే సంబంధిత ప్రాంతంలో వంద మీటర్ల దూరం వరకు బోర్లు వేసి ఉంటే ఆ ప్రాంతంలో మళ్లీ బోర్లు తవ్వడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ వీలుండదు. నివాస ప్రాంతాల్లో వేసుకునే బోర్లకు సైతం అనుమతులు తీసుకోవాలి. వాల్టా చట్టాన్ని ఉల్లంఘిస్తే రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. జగి త్యాల జిల్లాలో ప్రస్తుతం సుమారు 1.30 లక్షల బోరు బావులు, బావు లున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఎప్పటికప్పుడు బోర్ల తవ్వ కాలపై రికార్డులను సరిచూడాల్సి ఉన్నప్పటికీ అధికారులు పట్టించు కోవడం లేదు. 

జిల్లాలో పరిస్థితి...

జిల్లాలో 3 రెవెన్యూ డివిజన్లు, 18 మండలాలు, 380 గ్రామ పంచా యతీలు, 5 మున్సిపాల్టీలున్నాయి. జిల్లాలో 509 గ్రామ పంచాయతీ చె రువుల కింద 3,130 హెక్టర్ల నీటి విస్తీర్ణం, 185 మత్స్య శాఖ చెరువుల కింద 15,162 హెక్టార్ల నీటి విస్తీర్ణం ఉంది. జిల్లాలో బోరు బావులు, బా వుల కోసం 1,31,847 వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లున్నాయి. జిల్లాలో 2,645 కిలోమీటర్ల భూగర్భ విస్తీర్ణం ఉంది. జిల్లాలో సాధారణ వర్ష పాతం 1,026 మిల్లీమీటర్లు కాగా కురిసిన వర్షాపాతం 1,210.2 మిల్లీమీ టర్లు నమోదయింది. 

అయిదు మండలాల్లో పొంచి ఉన్న ప్రమాదం...

జిల్లాలోని 13 మండలాల్లో భూగర్బ జలాలు సురక్షితంగా ఉన్నట్లు భూగర్బ జల శాఖ అధికారులు ఇటీవల జరిపిన సర్వేలో గుర్తించారు. 70 శాతం కంటే తక్కువగా నీటిని వినియోగిస్తే సురక్షితమని, 90 శా తం నుంచి 100 శాతం వరకు వినియోగిస్తే ప్రమాదకరమని నిర్ణయిస్తా రు. జిల్లాలోని 18 మండలాల్లో 13 సురక్షితంగా 2 మండలాలు ప్రమా దకరంగా, 3 మండలాలు పాక్షికంగా ప్రమాదకరంగా ఉన్నట్లు గుర్తించా రు. సురక్షితంగా ఉన్న మండలాల జాబితాలో బీర్‌పూర్‌, బుగ్గారం, ధర్మ పురి, గొల్లపల్లి, ఇబ్రహీంపట్నం, జగిత్యాల, జగిత్యాల రూరల్‌, కోరుట్ల, మల్లాపూర్‌, పెగడపల్లి, రాయికల్‌, సారంగపూర్‌, వెల్గటూరు ప్రాంతాలు న్నాయి. అదేవిధంగా ప్రమాదకరంగా కథలాపూర్‌, కొడిమ్యాల మండలా లు, పాక్షికంగా ప్రమాదకరం మల్యాల, మేడిపల్లి, మెట్‌పల్లి మండలాలు న్నాయి. అధిక భూగర్బ జలాలు వినియోగించిన ప్రాంతాల్లో కొత్తగా బోర్లు వేయడం, ఇసుక తీయడం నిషేధిస్తారు. జిల్లాలో అతి ఎక్కువ నీటి వినియోగం రెండు మండలాల్లో మాత్రమే ఉంది. కొంత ఎక్కువగా భూగర్బ జలాలు వాడుతున్న నాలుగు ఐదు మండలాల్లో రానున్న రోజుల్లో నీటి పొదుపు చర్యలు పాటించడంతో పాటు వృథా నీటిని భూమిలోకి ఇంకించే చర్యలు చేపట్టాల్సిన అవసరముంది. 

భూగర్బ జలాలను కాపాడుకోవాలి

- జి. నర్సింలు, జిల్లా భూగర్బ జల శాఖాధికారి

వాల్టా చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత సంబంధిత మండలాల తహసీల్దార్లదే. ఆయా మండలాల్లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన అనంతరం రెవెన్యూ అధికారులు భూగర్భ జల శాఖకు పంపే వాటిని మాత్రమే టెక్నికల్‌ అంశాల ఆధారంగా పరిశీలిస్తాము. ఇందుకు సంబం ధించి రెవెన్యూ కార్యాలయాల్లో ప్రత్యేక రికార్డులుండాలి. అంతంతమా త్రంగానే దరఖాస్తులు వస్తున్నాయి. ప్రతీ ఒక్క బోరు బావి తవ్వకానికి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.


Updated Date - 2022-04-25T06:46:46+05:30 IST