వినాయకా..వీడ్కోలిక

ABN , First Publish Date - 2022-09-11T06:06:08+05:30 IST

జై బోలో గణేష్‌ మహారాజ్‌కి జై ...గణపయ్యా.. వెళ్లి రావయ్యా.. మళ్లీ ఏడాదికి తిరిగి రావయ్యా.. అంటూ భ క్తులు గణనాథునికి ఘనంగా వీడ్కోలు పలికారు.

వినాయకా..వీడ్కోలిక

జిల్లాలో రెండో రోజు ఘనంగా నిమజ్జన వేడుకలు

భక్తులతో కిటకిటలాడిన టవర్‌, చింతకుంట చెరువు

పరిశీలించిన కలెక్టర్‌

జగిత్యాల టౌన్‌, సెప్టెంబరు 10 : జై బోలో గణేష్‌ మహారాజ్‌కి జై ...గణపయ్యా.. వెళ్లి రావయ్యా.. మళ్లీ ఏడాదికి తిరిగి రావయ్యా.. అంటూ భ క్తులు గణనాథునికి ఘనంగా వీడ్కోలు పలికారు. 9 రోజుల పాటు అత్యం త వైభవంగా పూజలు చేసిన భక్తులు వినాయక నిమజ్జన వేడుకలను రెం డవ రోజు శనివారం ఘనంగా జరుపుకున్నారు. ఉదయం నుండే గణపతు ల శోభాయాత్ర ప్రారంభం కాగా టవర్‌, చింతకుంట చెరువు ప్రాంతాలు భక్త జనంతో కిటకిటలాడాయి. కలెక్టర్‌ రవితో పాటు బల్దియా చైర్‌ పర్సన్‌ శ్రావణి చింతకుంట చెరువు వద్ద వేడుకలను పరిశీలించి అధికారులకు, సి బ్బందికి పలు సూచనలు చేశారు. శోభాయాత్రగా తరలివచ్చిన వినాయ కులకు టవర్‌ వద్ద గణేష్‌ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలుకగా వివిధ రాజకీయ పార్టీల నాయకులు కొబ్బరి కాయలు కొట్టి ప్ర త్యేక పూజలు నిర్వహించారు. పలు మండపాల్లో లడ్డూల వేలం పాటలు పాట పాడి దక్కించుకున్నారు. పట్టణంలోని సుమారు 300 పైగా విగ్రహా లు నిమజ్జనానికి తరలిరాగా తెల్లవారుజాము వరకు నిమజ్జన వేడుకలు కొ నసాగాయి. ఏలాంటి ఆవాంఛనీయ సంఘటనలు జరుగకుంగా ఎస్పీ సిం ధుశర్మ ఆధ్వర్యంలో జగిత్యాల డీఎస్పీ ప్రకాష్‌ తన సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు.

వేడుకలపై అసంతృప్తి...

జిల్లా కేంద్రంలోని చింతకుంట చెరువు వద్ద శుక్రవారం నిర్వహించిన నిమజ్జన వేడుకలపై అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు తన అసంతృ ప్తిని వ్యక్తం చేశాడు. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, విగ్రహాల నిమజ్జన తీరుపై సో షల్‌ మీడియాలో ఓ విడియో క్లిప్పింగ్‌ పెట్టడం చర్చకు దారి తీసింది.  

కొడిమ్యాల : మండల కేంద్రంలో రామాలయం వద్ద, ఛత్రపతి శివాజీ యూత్‌, వివేకానంద నగర్‌ యూత్‌ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయ కులను శనివారం ఘనంగా నిమజ్జనం చేశారు. మండపాల నుంచి ట్రా క్టర్లలో ఊరేగింపుగా సమీపంలోని వాగు వద్దకు తీసుకెల్లి నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో నిర్వహకులు, భక్తులు పాల్గొన్నారు. 

మండలంలోని గౌరాపూర్‌ గ్రామంలోని వినాయక మండపం వద్ద శని వారం అన్నదానం చేశారు. సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు కృష్ణారా వు, సింగిల్‌ విండోల చైర్మనులు రవీందర్‌రెడ్డ్డి, రాజనర్సింగరావు పాల్గొన్నారు.

 మెట్‌పల్లిలో పోలీసుల భారీ బందోబస్తు

మెట్‌పల్లి:  జైజై గణేషా...బైబై గణేషా...గణపతి బొప్పా మోరియా... అం టూ మెట్‌పల్లి పట్టణం మారుమోగిపోయింది. తొమ్మిది రోజుల పాటు ప్ర త్యేకపూజలందుకున్న గణనాథుడు శనివారం చివరి రోజు నిమజ్జనోత్సవా నికి తరలివెళ్లిపోయాడు. పట్టణంలోని ప్రారంభమైన వినాయక నిమజ్జన ర్యాలీని ఆర్‌డీవో వినోద్‌ కుమార్‌, డీఎస్‌పీ రవీందర్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ రాణవేని సుజత-సత్యనారయణ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లను చే శారు. వినాయక విగ్రహాలను శోభయాత్రగా తీసుకెళ్లి పట్టణ శివారులోని వట్టి వాగులో నిమజ్జనం చేశారు. చిన్నారులు, యువతులు, మహిళలు, ని మజ్జనోత్సవంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. మున్సిపల్‌ ఆధ్వర్యంలో  ప్రత్యే క ఏర్పాట్లు చేశారు. నిమజ్జనోత్సవం సందర్భంగా మెట్‌పల్లి డీఎస్పీ రవీం ధర్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీ బందోబస్తు నిర్వహించారు.

ఇబ్రహీంపట్నం: మండలంలోని పలు గ్రామాల్లో వినాయక నిమజ్జన ఉత్సవాను ఘనంగా నిర్వహించారు. గ్రామాలలో ప్రత్యేకంగా అలంకరించి న ప్రత్యేక వాహనాలలో గణపతి విగ్రహాలను ఉంచి శోభాయాత్ర నిర్వ హించారు. అనంతరం గ్రామ శివారులోని చెరువుల్లో నిమజ్జనం జరిపారు. ఈ కార్యక్రమంలో యువజన సంఘాల నాయకులు, మహిళలు, చిన్నా రులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-09-11T06:06:08+05:30 IST