ఇసుక తవ్వకాలను అడ్డుకున్న గ్రామస్థులు

ABN , First Publish Date - 2022-12-12T00:25:50+05:30 IST

మండలంలోని చల్లూరు గ్రామ శివారులోని మానేరు వాగు సమీపంలో ఇసుక క్వారీ పనులను ఆదివారం గ్రామస్థులు, రైతులు అడ్డుకున్నారు.

ఇసుక తవ్వకాలను అడ్డుకున్న గ్రామస్థులు
క్వారీ పనులను అడ్డుకున్న రైతులు, గ్రామస్థులు

వీణవంక, డిసెంబరు 11: మండలంలోని చల్లూరు గ్రామ శివారులోని మానేరు వాగు సమీపంలో ఇసుక క్వారీ పనులను ఆదివారం గ్రామస్థులు, రైతులు అడ్డుకున్నారు. మండలంలో గతంలో మూడు గ్రామాల్లో ఇసుక రీచ్‌లు ఏర్పాటు చూసి స్థానిక అవస రాలకు ఇసుకను తోడారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఇసుక క్వారీలకు టెండర్లు వేసి వేలం వేయగా 7 క్వారీలను కాంట్రాక్టర్లు దక్కించుకొని పనులు చేపడుతుండగా రైతుల నుంచి వ్యతిరేకత మొదలైంది. కాంట్రాక్టర్లు పనులు చేపట్టేందుకు వెళ్లగా రైతులు భూములు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు.

Updated Date - 2022-12-12T00:25:50+05:30 IST

Read more