స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తి రగిలేలా వజ్రోత్సవాలు
ABN , First Publish Date - 2022-08-05T05:19:15+05:30 IST
దేశభక్తి స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తి ప్రజలందరిలో రగిలేలా స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాలను వైభవంగా నిర్వహించాలని కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారు లకు సూచించారు.
- కలెక్టర్ అనురాగ్ జయంతి
సిరిసిల్ల, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): దేశభక్తి స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తి ప్రజలందరిలో రగిలేలా స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాలను వైభవంగా నిర్వహించాలని కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారు లకు సూచించారు. కలెక్టరేట్‌లో వజ్రోత్సవాల నిర్వహణపై అన్ని ప్రభుత్వ శాఖల జిల్లా అధికారుల తో సన్నాహక సమావేశం గురువారం నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థు లు, ఉద్యోగులు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధు లు, యువతీయువకులు జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలు ఉత్సాహంగా పాల్గొనేలా చూడాలని అన్నారు. వజ్రోత్సవాలను పురస్కరించుకొని ప్రజల్లో అడుగుఅడుగునా దేశభక్తి భావన కల్పించేలా కార్యక్రమాలు నిర్వహిం చాలని ఆదేశించారు. పాఠశాలల విద్యార్థుల నుంచి మొదలుకొని ఉద్యోగులు, ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొనా లని పిలుపునిచ్చారు. ఈ నెల 8 నుంచి 20 వరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాలను విజయ వంతం చేయాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు సత్యప్రసాద్, ఖీమ్యానాయక్, ఆర్డీవో శ్రీనివాసరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.