సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలి

ABN , First Publish Date - 2022-10-18T05:34:37+05:30 IST

వ్యవసాయరంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రణధీర్‌ రెడ్డి సూచించారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కళాశాల విద్యార్థులు జాతీయ సేవ పథకం ప్రత్యేక శిబిరం ముగింపులో భాగంగా సోమవారం మండలంలోని రాళ్లపేటలో కిసాన్‌ మేళాను నిర్వహించారు.

సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలి
మేళాను ప్రారంభిస్తున్న ప్రజాప్రతినిధులు

- జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రణధీర్‌ కుమార్‌

- వ్యవసాయ కళాశాల ఆధ్వర్యంలో కిసాన్‌ మేళా 

తంగళ్లపల్లి, అక్టోబరు 17: వ్యవసాయరంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రణధీర్‌ రెడ్డి సూచించారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కళాశాల విద్యార్థులు జాతీయ సేవ పథకం ప్రత్యేక శిబిరం ముగింపులో భాగంగా సోమవారం మండలంలోని రాళ్లపేటలో కిసాన్‌ మేళాను నిర్వహించారు. దీంట్లో భాగంగా ఆధునిక యంత్రాలను ప్రదర్శించారు. ఈ సదస్సులో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సందర్శించి వాటి ఉత్పత్తులను కంపెనీ ప్రతినిధులతో చర్చించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా వ్యవసాయ అధికారి  రణధీర్‌ కుమార్‌, ఎంపీపీ పడగల మానస రాజు మాట్లాడుతూ ఆధునిక వ్యవసాయ పద్ధతులను పాటిస్తూ అధిక దిగుబడులు సాధించాలన్నారు. వ్యవసాయ కళాశాల అసోసియేట్‌ డీన్‌ డా. టి ఉమామహేశ్వరి మాట్లాడుతూ వ్యవసాయ విశ్వవిద్యాలయం రూపొందించిన నూతన పరిజ్ఞానాన్ని, వివిధ పంటల్లో అభివృద్ధి చేసిన వంగడాలను సాగు చేస్తూ దిగుబడి పొందాలని సూచించారు. కార్యక్రమంలో మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు వలకొండ వేణుగోపాల్‌ రావు, తెలంగాణ రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ రీజనల్‌ మేనేజర్‌ ఆదినారాయణ రెడ్డి, వైస్‌ఎంపీపీ జంగిటి అంజయ్య, వేములవాడ సహాయ జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్‌, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కొమ్మిటి రాజిరెడ్డి , మండల వ్యవసాయ అధికారి సందీప్‌, వేణుగోపాల్‌పూర్‌ సర్పంచ్‌లు బాలసాని పరుశరాములు, కాయితి బాలయ్య పాల్గొన్నారు.


Updated Date - 2022-10-18T05:34:37+05:30 IST