ప్రజల భాగస్వామ్యంలోనే పట్టణ అభివృద్ధి

ABN , First Publish Date - 2022-12-16T00:45:51+05:30 IST

ప్రజల భాగస్వామ్యంలోనే పట్టణ అభివృద్ధి సాధ్యమవుతుందని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ అన్నారు.

ప్రజల భాగస్వామ్యంలోనే పట్టణ అభివృద్ధి
వార్డుల్లో పర్యటిస్తున్న ఎమ్మెల్యే, చైర్‌ పర్సన్‌

జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌

జగిత్యాల టౌన్‌, డిసెంబరు 15: ప్రజల భాగస్వామ్యంలోనే పట్టణ అభివృద్ధి సాధ్యమవుతుందని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ అన్నారు. జగిత్యాల పట్టణంలోని పలు వార్డుల్లో గురువారం ఎమ్మెల్యే పర్యటించారు. ఈ సందర్భం గా అమరవీరుల స్థూపం, లింగం చె రువు పార్కు నిర్మాణ పనులు, 27వ వార్డులో మిషన్‌ భగీరథ పనులు, ఉర్థూ పాఠశాల, బస్తీ దవాఖాన, ఉర్థూ ఘర్‌లను చైర్‌ పర్సన్‌ బోగ శ్రావణితో కలిసి ఎమ్మెల్యే సందర్శించారు. అనంతరం సంజయ్‌ కుమార్‌ మాట్లాడుతూ పట్టణంలో గతంలో తాగునీటికి ఎన్నో ఇబ్బం దులు అయ్యాయని, తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇంటింటికీ నాణ్యమైన పైపు లైను వేసి నీరు అందిస్తున్నామన్నారు. పట్టణంలో రూ. 43 కోట్లతో మిషన్‌ భగీరథ ప నులు వేగంగా జరుగుతున్నాయన్నారు. ప్రతి పక్షాలకు అభివృద్ధి కళ్లకు కనిపించడంలేదని గతానికి ఇప్పటికి జరిగిన అభివృద్ధిని ప్రజలు పోల్చిచూడాలన్నారు. ఈ కార్యక్రమంలో వైస్‌ చైర్మన్‌ గోళి శ్రీనివాస్‌, డీఈ రాజేశ్వర్‌ ఉన్నారు.

Updated Date - 2022-12-16T00:45:53+05:30 IST