కొత్తగా మరో రెండు మండలాలు

ABN , First Publish Date - 2022-07-24T05:18:46+05:30 IST

జిల్లాలో మరో రెండు కొత్త మండ లాలు ఏర్పాటు కానున్నాయి.

కొత్తగా మరో రెండు మండలాలు

జాబితాలో భీమారం, ఎండపల్లి 

- ప్రాథమిక నోటిఫికేషన్‌ విడుదల చేస్తూ ఉత్తర్వులు

- పరిశీలన అనంతరం జారీ కానున్న తుది నోటిఫికేషన్‌

జగిత్యాల, జూలై 23 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మరో రెండు కొత్త మండ లాలు ఏర్పాటు కానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం ప్రాథమికంగా నోటిఫి కేషన్‌ జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌  ఉత్తర్వులను విడుదల చేశారు. కోరుట్ల రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని మేడిపల్లి మండలంలో గల భీమారం, జగిత్యాల రెవెన్యూ డివిజన్‌ పరిధి లోని వెల్గటూరు మండల పరిధిలో గల ఎండపల్లిలను మండలాలుగా ఏర్పాటు చేయనుంది. ఎండపల్లి మండలాన్ని జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలో ని పలు గ్రామాలతో ఏర్పాటు చేయనుండగా, భీమారం మండలాన్ని జగిత్యాల జిల్లాలోని గ్రామాలతో ఏర్పాటు చేయనుంది. 

యేడాది క్రితం ప్రతిపాదనలు...

సుమారు గత యేడాది క్రితం కొత్త మండలాల వివరాలు, సంబంధిత మ్యాప్‌, వాటి పేర్లు, జనాభా, గ్రామ పంచాయతీలు తదితర వివరాలతో ప్రభుత్వానికి జిల్లా అధికారులు ప్రతిపాదనలు పంపారు. మంత్రి కొప్పుల ఈశ్వర్‌ సూచన మేరకు ఎండపల్లి మండలాన్ని, వేములవాడ, కోరుట్ల ఎమ్మెల్యేలు చెన్నమనేని రమేశ్‌ బాబు, కల్వకుంట్ల విద్యాసాగర్‌ రావుల సూచనల మేరకు భీమారం మండలాన్ని ఏర్పాటు చేయడానికి అవసర మైన అన్ని కసరత్తులను ప్రభుత్వం పూర్తి చేసింది. 

పక్షం రోజుల పాటు అభ్యంతరాలు..వినతుల స్వీకరణ...

కొత్తగా ఏర్పాటు కానున్న భీమారం, ఎండపల్లి మండలాలపై పక్షం రోజుల్లోగా అభ్యంతరాలు, వినతులను స్వీకరించనున్నారు. కలెక్టర్‌ ద్వారా అందిన ప్రజల అభ్యంతరాలు, వినతులను పరిశీలించిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం కొత్త మండలాలను ఏర్పాటు చేస్తూ తుది నోటిఫికేషన్‌ జారీ చేయనుంది.

మేడిపల్లి మండలం పునర్విభజనతో భీమారం.... 

జిల్లాలో వేములవాడ నియోజకవర్గ పరిధిలో ప్రస్తుతం గల మేడిపల్లి మండలాన్ని పునర్విభజన చేసి భీమారం మండలాన్ని ఏర్పాటు చేయను న్నారు. ప్రస్తుతం మేడిపల్లి మండలంలో ఉన్న 19 గ్రామాలను విభజించి 10 గ్రామాలను మేడిపల్లిలో, 9 గ్రామాలను కొత్తగా ఏర్పడే భీమారం మండలంలో కలపనున్నారు. భీమారం మండలంలో 27,784 ఎకరాల స్థ లం, 21,362 మంది జనాభాతో పాటు గోవిందారం, భీమారాం, పసునూ రు, మన్నెగూడం, ఒడ్డెడు, లింగంపేట, రాగోజిపేట, రంగాపూర్‌, వెంకట్రా వుపేట గ్రామాలు ఉండనున్నాయి. మేడిపల్లి మండలంలో 23,796 ఎకరా ల స్థలం, 29,847 జనాభాతో పాటు కట్లకుంట, పోరుమళ్ల, తొంబార్రావు పేట, మేడిపల్లి, కొండాపూర్‌, వల్లంపల్లి, మాచాపూర్‌, దమ్మన్నపేట, కల్వ కోట, కాచారం గ్రామాలు ఉండనున్నాయి. ఈరెండు మండలాలను జి ల్లాలో కొత్తగా ఏర్పడ్డ కోరుట్ల రెవెన్యూ డివిజన్‌ పరిధిలో కొనసాగించేలా ప్రాథమిక నోటిఫి కేషన్‌ను విడుదల చేసింది

వెల్గటూరు మండలం పునర్విభజనతో ఎండపల్లి..

జిల్లాలోని ధర్మపురి నియోజకవర్గ పరిధిలో ప్రస్తుతం గల వెల్గటూరు మండలాన్ని పునర్విభజన చేసి ఎండపల్లి పల్లి మండలాన్ని ఏర్పాటు చే యనున్నారు. ప్రస్తుతం వెల్గటూరు మండలంలో 27 గ్రామ పంచాయ తీలున్నాయి. కొత్తగా ఏర్పాటయ్యే ఎండపల్లి మండలంలో 13 రెవెన్యూ గ్రా మాలు ఉండనున్నాయి. ఇందులో ఎండపల్లి, కొండాపూర్‌, గుగ్లకోట, అం బారిపేట, కొత్తపేట, పడ్కల్‌, గొడిశెలపేట, శానబండ, పాతా గూడూర్‌, సూరారం గ్రామాలతో పాటు పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం పరిధి లో ప్రస్తుతం ముంజపల్లి, మారేడుపల్లి, ఉండెడ గ్రామాలతో మండలా న్ని ఏర్పాటు చేయనున్నారు. ఎండపల్లి మండలంలో 25,277.17 ఎకరాలు, 27,758 జనాభా ఉంటుందని ప్రతిపాదించారు. పునర్విభజన తదుపరి వెల్గటూరు మండలంలో 15 గ్రామ పంచాయతీలుండనున్నాయి. వెల్గటూ రు, కుమ్మరిపల్లి, స్తంభంపల్లి, వెంకటాపూర్‌, పాశిగాం, కిషన్‌రావుపేట, జగదేవ్‌పేట, కప్పారావుపేట, ముక్కట్‌రావు పేట, ముత్తనూర్‌, రామ్‌నూ ర్‌, చెగ్యాం, శాఖాపూర్‌, పైడిపల్లిలతో పాటు ప్రస్తుత బుగ్గారం మండలం లో గల బీరసాని గ్రామ పంచాయతీలతో వెల్గటూరు మండలాన్ని ఏర్పా టు చేయడానికి ప్రతిపాదనలు వెళ్లాయి. పునర్విభజన తదుపరి వెల్గటూ రు మండలంలో 26,452 ఎకరాల స్థలం, 26,028 మంది జనాభా ఉండే విధంగా ప్రతిపాదించారు ఎండపల్లి మండలం జగిత్యాల రెవెన్యూ డివిజ న్‌ పరిధిలో ఉండేలా ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీ చేసింది.

జిల్లాలో 20కి పెరగనున్న మండలాలు...

కొత్త మండలాల ఏర్పాటుతో ప్రస్తుతం ఉన్న 18 మండలాలకు తోడు కొత్త మండలాలు 2 కలుపుకొని 20 మండలాలతో జిల్లా స్వరూపం మార నుంది. కొత్త మండలాల ఏర్పాటు వ్యవహారం రాజకీయ వర్గాల్లో చర్చనీ యాంశంగా మారింది.

సంతోషంగా ఉంది

పెద్దిరెడ్డి స్వామి రెడ్డి, భీమారం వాసి

మా గ్రామం కేంద్రంగా కొత్తగా మండలం ఏర్పాటు కానుండడం సం తోషంగా ఉంది. కొత్త మండలం ఏర్పాటు వల్ల పరిపాలన పరమైన సౌల భ్యం కలగనుంది. పనులు మరింత వేగవంతం అయ్యే అవకాశాలు న్నాయి.

కొత్త మండలం ఏర్పాటుతో మరింత అభివృద్ధి

- మారం జలందర్‌ రెడ్డి, సర్పంచ్‌, ఎండపల్లి

ఎండపల్లి కేంద్రంగా కొత్త మండలం ఏర్పాటు కానుండడంతో మును ముందు మరింత అభివృద్ధి జరగనుంది. ప్రభుత్వ పరమైన పనులు వేగ వంతంగా జరుగుతాయి. ఎండపల్లి గ్రామం కేంద్రంగా మండలం ఏర్పాటు కానుండడం సంతోషకరం.

Updated Date - 2022-07-24T05:18:46+05:30 IST