పేదల సంక్షేమానికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కృషి

ABN , First Publish Date - 2022-10-05T06:01:44+05:30 IST

పేద ప్రజల సంక్షేమం కోసం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని చొప్పదండి ఎమ్మల్యే రవిశంకర్‌ అన్నారు. బోయినపల్లి మండలం తడగొండ గ్రామంలో కల్యాణ లక్ష్మి లబ్ధిదారులకు ఎమ్మెల్యే చెక్కులను పంపిణీ చేశారు.

పేదల సంక్షేమానికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కృషి
కల్యాణలక్ష్మీ చెక్కు అందజేస్తున్న ఎమ్మెల్యే

బోయినపల్లి, అక్టోబరు 4: పేద ప్రజల సంక్షేమం కోసం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని చొప్పదండి ఎమ్మల్యే రవిశంకర్‌ అన్నారు. బోయినపల్లి మండలం తడగొండ గ్రామంలో కల్యాణ లక్ష్మి లబ్ధిదారులకు ఎమ్మెల్యే చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం గ్రామంలో సిమెంట్‌ రోడ్ల నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్‌, ఏఎంసీ చైర్మన్‌ సత్యనారాయణరెడ్డి, సర్పంచ్‌ చిందం రమేష్‌, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు జోగినపల్లి రవీందర్‌రావు, మండల  అధ్యక్షుడు కత్తెరపాక కొండయ్య, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. 


Read more