8ఏ ప్రమాద మృతులకు ఘన నివాళులు

ABN , First Publish Date - 2022-10-18T05:07:44+05:30 IST

8ఏ ప్రమాదం జరిగి19 ఏళ్ళు పూర్తయి న సందర్భంగా సోమవారం గని సమీపంలోని అమరులస్తూపం వద్ద సంస్మరణ సభ నిర్వహించారు.

8ఏ ప్రమాద మృతులకు ఘన నివాళులు
స్తూపం వద్ద మృతులకు నివాళులర్పిస్తున్న నాయకులు

యైుటింక్లయిన్‌కాలనీ, అక్టోబరు 17: 8ఏ ప్రమాదం జరిగి19 ఏళ్ళు పూర్తయి న సందర్భంగా సోమవారం గని సమీపంలోని అమరులస్తూపం వద్ద సంస్మరణ సభ నిర్వహించారు. స్తూపానికి కార్మిక సంఘాల నాయకులు, మృతుల కుటుంబ సభ్యులు పూలమాలు వేసి మరణించిన కార్మికులకు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడారు. 8ఏ ప్రమాదం యాజమాన్య నిర్లక్ష ధోరణికి నిదర్శనమని, రక్షణ చర్యలలో విఫలమైన కారణంగానే 2003 అక్టోబర్‌ 16 అర్ధరాత్రి ప్రమాదంలో 10మంది కార్మికులు మృత్యువాత పడ్డారని పేర్కొన్నారు. 8ఏ, 7ఎల్‌ఈపీ ప్రమాదాలపై విచారణలో యాజమాన్య నిర్లక్ష్యమ ని తేలినా, బాధ్యులపై చర్యలు తీసుకోలేదన్నారు. 8ఏ ప్రమాద బాధిత కుటుం బాలకు అండగా ఉంటామని నాయకులు హామీఇచ్చారు. ఈ సంస్మరణ సభలో టీబీజీకేఎస్‌ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, నాయకులు దేవవెంకటేశం, అయిలిశ్రీనివాస్‌, సత్యనారాయణరెడ్డి, శంకర్‌నాయక్‌, ఎట్టం కృష్ణ, దశరథం, బీ ఎంఎస్‌, ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎన్‌టీయూసీ నాయకులు యాదగిరి సత్త య్య, ప్రకాష్‌, రాజారత్నం, అన్నారావు, ఉల్లి మొగిలి, సంపత్‌రెడ్డి, ప్రసాద్‌తో పాటు ఆనాటి ప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబసభ్యులు, పలువు రు కార్మికులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-10-18T05:07:44+05:30 IST